Ads
ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు దొర్లడం సహజమే.కానీ అస్సాం లోని దారెంజీ జిల్లా లో పెద్ద తప్పిదమే జరిగింది.మంగలదై సివిల్ ఆసుపత్రిలో కోలోకున్న కరోనా పేషెంట్ కు బదులు కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిని డిశ్చార్జ్ చేసారు.ఇప్పుడు ఈ విషయం అంతటా సంచలనం గా మారింది..వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
ఇండియన్ ఏక్సప్రెస్ కధనం ప్రకారం … కరోనా నుండి కోలుకున్న ఐదుగురు వ్యక్తులను డిశ్చార్జ్ చెయ్యడానికి ఆసుపత్రి బృందం నిశ్చయించుకుంది.అయితే అందులో హమీద్ అలీ కూడా ఉన్నాడు.అయితే ఈ ఐదుగురిని బుధవారం రాత్రి ఏడూ గంటల సమయంలో డిశ్చార్జ్ చేసారు.కాగా హమీద్ అలీ కి బదులుగా హనీఫ్ అలీ ని డిశ్చార్జ్ చేసారు.హనీఫ్ అలీ తో పాటుగా నాజ్రుల్ ఇస్లాం ,సాజిబుల్ హక్యూ,సికిందర్ అలీ ,సాహిదుల్ హక్యూ మరియు ఉస్మాన్ గోని ను విడుదల చేసారు.
వీరిద్దరి పేరులు దాదాపు ఒకేలా ఉండడం వలన మరియు అందరూ మాస్క్లు ధరించి ఉండడం వలన ఈ తప్పిదం జరిగింది అని ఆ ఆసుపత్రి డిఎం అన్నారు.అందుకే మా ఆసుపత్రి సిబ్బంది తప్పు వ్యక్తిని డిశ్చార్జ్ చేసారని డిఎమ్ అన్నారు.తప్పు వ్యక్తిని డిశ్చార్జ్ చేశామని తెలుసుకున్నాఆసుపత్రి బృందం ఆ వ్యక్తిని తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చి మళ్ళీ తిరిగి కరోనా టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ గా నిర్దారణ అయింది.దారెంజీ జిల్లా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ…హనీఫ్ అలీ కుటుంబ సభ్యులందరి దగ్గర నుండి కూడా శ్వాబ్స్ తీసుకున్నాం ప్రస్తుతం వాళ్ళందరిని ఇంట్లోనే నిర్బందించాము అని తెలిపారు.
End of Article