పవన్ కళ్యాణ్ న్యూ లుక్..నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కు హాజరైన పవన్ …ఫోటో వైరల్

పవన్ కళ్యాణ్ న్యూ లుక్..నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కు హాజరైన పవన్ …ఫోటో వైరల్

by Megha Varna

Ads

పవన్ కు ప్రస్తుతం ఉన్న తెలుగు యువ హీరోలలో ఎవరైనా వీరాభిమాని ఉన్నారనే ప్రశ్నకు ఎవరైనా టక్కున నితిన్ అని సమాధానం చెప్పేస్తారు.అలాంటి నితిన్ పెళ్ళికొడుకుగా పీఠలు ఎక్కడానికి సిద్దమవుతున్నాడు. అలాంటి నితిన్ ను ఆశీర్వదించడానికి తప్పకుండా పవన్ వస్తాడు అని ప్రచారం జరిగింది.

Video Advertisement

ప్రస్తుతమున్న కరోనా నేపథ్యంలో ఇది జరుగుతుందా? జరగదా? అని అందరూ డౌట్ పడ్డారు.తనని నమ్ముకున్న వాళ్ళ కోసం పవన్ ఎప్పుడూ ముందుంటాడు.అందుకే నితిన్ చేసుకుంటున్న ఈ వేడుకకు తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ చిన్నబాబుతో కలిసి హాజరయ్యారు.ఈ విషయాన్ని స్వయంగా నితిన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.తనని ఆశీర్వదించడానికి వచ్చిన మీకు నా ధన్యవాదాలు అంటూ ఓ మెసేజ్ చేశారు.నితిన్ పోస్ట్ చేసిన ఫోటోలో పవన్ కళ్యాణ్ న్యూ లుక్ తో దర్శనమిచ్చారు.ఇప్పుడు ఆ లుక్ పవన్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అనే చర్చ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది.

మొన్న చిరంజీవి గారు న్యూ లుక్ తో దర్శనమిచ్చారు ఇప్పుడు తాజాగా పవన్ న్యూ లుక్ తో దర్శనమివ్వడం తో సోషల్ మీడియా వాళ్ళకు కావలసినంత కంటెంట్ దొరికింది. అసలు పవన్ న్యూ లుక్ వెనుక దాగున్న రహస్యం ఏంటని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

 


End of Article

You may also like