Ads
పవన్ సినిమాను నిర్మించాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న దిల్ రాజు చివరకు వకీల్ సాబ్ చిత్రంతో ఆ కోరికను తీర్చుకుంటున్నారు.దాదాపు రెండేళ్లు తర్వాత పవన్ వకీల్ సాబ్ చిత్రం చేస్తుండండంతో అభిమానులు ఈ మూవీ విడుదల కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.ముందుగా అనుకున్నట్టు ఆఖరి 20 రోజులు షూటింగ్ పూర్తి చేసుకొని మే నెల బరిలో రావాల్సిన ఈ చిత్రం కరోనా వల్ల ఆగిపోయింది.
Video Advertisement
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగ్ లకు పర్మిషన్ లు ఇచ్చినా థియేటర్స్ లేనప్పుడు రిస్క్ చేయడం ఎందుకని చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది.ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ చక్కబడాడ్డనికి చాలా టైమ్ పట్టేలా ఉంది.దానితో వకీల్ సాబ్ ఇప్పట్లో మొదలవ్వదని క్లారిటీ వచ్చిన అభిమానులు డిసప్పాయింట్ అవ్వకూడదు అని నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నారట అందుకే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
సరిగ్గా సెప్టెంబర్ 2న అంటే పవన్ పుట్టిన రోజున పవన్ ఫ్యాన్స్ కు వకీల్ సాబ్ టీజర్ తో గిఫ్ట్ ఇవ్వాలని నిర్మాత దిల్ రాజ్ అనుకుంటున్నారని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.
End of Article