Home Filmy Adda “బ్రో” మూవీలో తన పాత్ర కోసం… “పవన్ కళ్యాణ్” ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారా..?

“బ్రో” మూవీలో తన పాత్ర కోసం… “పవన్ కళ్యాణ్” ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారా..?

by Mohana Priya

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ కాంబినేషన్‌లో సముద్రఖని డైరెక్టర్‌గా తెరకెక్కిన చిత్రం బ్రో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. జూలై 28న విడుదల ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ చిత్రం సిద్ధంగా ఉంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన పాటలు మరియు అందరిని ఆకట్టుకున్నాయి.

విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం గురించి తాజాగా మూవీ డైరెక్టర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ చిత్రం షూటింగ్ ఇంత త్వరగా పూర్తవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదట. ఇక ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ శ్రద్ధ మరియు నిష్ఠ గురించి డైరెక్టర్ ఎంతగానో పొగిడారు. ఇందులో దేవుడి పాత్ర చేయడం‌తో పవన్ షూటింగ్ అయ్యేవరకు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోలేదని ఆయన వెల్లడించారు.

కోవిడ్ సమయం కావడంతో ఈ చిత్రం తమిళ్లో తీసినప్పుడు ఆ పాత్ర తానే చేయవలసి వచ్చింది అని సముద్రఖని వెల్లడించారు. ఎక్కువమందికి ఈ కథను చేరువ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇందులో పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది అని త్రివిక్రమ్ చెప్పారట. పవన్‌ని కలిసి స్క్రిప్ట్ చెప్పినప్పుడు కథ బాగుంది సినిమా ఎప్పటినుంచి మొదలు పెడతారు అని అడగడంతో ఒప్పుకుంటే రేపటి నుంచే అని సముద్రఖని చెప్పడం పవన్‌ని ఆశ్చర్యానికి గురిచేసింది.

bro-movie

మొదటిరోజు సెట్‌లోకి అడుగుపెట్టిన పవన్ అక్కడ ఏమి జరుగుతుందో పూర్తిగా గమనించి నిజంగా సినిమాపై డైరెక్టర్‌కు ఉన్న అభిలాషను గుర్తించారట. దర్శకుడిగా అతను ఎంత క్లారిటీగా ఉన్నాడో అర్థం చేసుకున్న పవన్ సినిమా కోసం సమయం వృధా కాకూడదు అని సెట్స్ లోనే కాస్ట్యూమ్స్ మార్చుకునేవారట. తాను చేస్తున్న పాత్ర కోసం షూటింగ్ జరిగినన్ని రోజులు పవన్ ఎంతో నిష్టగా దీక్షతో నటించారు అని బ్రో మూవీ డైరెక్టర్ తన ట్వీట్లో రాశారు.

ALSO READ : తెలుగులో మొదటిసారిగా ఆ హీరోతో జతకట్టబోతున్న పూజా హెగ్డే..! ఎవరంటే..?

You may also like