పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన అయ్యపనుమ్ కోషియుమ్ రీమేక్ రూపొందుతోంది అన్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ సినిమా బృందం ఇవాళ విడుదల చేశారు. పోలీస్ గెటప్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోని పోస్ట్ చేసి, పవన్ కళ్యాణ్ సినిమాలో పోషించే పాత్ర పేరు కూడా రివీల్ చేశారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్ల నాయక్ అనే పాత్రలో కనిపించబోతున్నారు.

అన్నీ జాగ్రత్తలతో ఇవాళ షూటింగ్ మళ్లీ తిరిగి ప్రారంభించారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు అనే వార్త ప్రచారంలో ఉంది. మరి అది ఎంతవరకు నిజమో సినిమా బృందం అధికారికంగా ప్రకటించేంత వరకు తెలియదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లుతో కూడా బిజీగా ఉన్నారు.