మొదటి సినిమాకి పవన్ కళ్యాణ్ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

మొదటి సినిమాకి పవన్ కళ్యాణ్ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

by Megha Varna

టాలీవుడ్ లో హీరో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ప్రత్యేకమని చెప్పాలి.ఎందుకంటే మొదటి నుండి కూడా వైవిధ్యమైన చిత్రాలను ,పాత్రలను ఎంచుకుంటూ తన టేస్ట్ కు తగ్గ సినిమాలలో నటించి మెప్పించారు పవన్ కళ్యాణ్.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాకు దాదాపు 50 కోట్లకు పైనే పారితోషకం తీసుకుంటున్నారు.అయితే మరి పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఆరంభించిన కొత్తలో ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా ? .. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం …

Video Advertisement

పవన్ కళ్యాణ్ చిత్రం బాగుందా ,బాగోలేదా అనే తేడాలు ఏమి చూడకుండా ఆయన సినిమాలు చూస్తూ అభిమానించేవాళ్ళు చాలామందే ఉన్నారు.గబ్బర్ సింగ్ కు ముందు దశాబ్ద కాలంపాటు హిట్ లేకపోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు అంటే అభిమానులలో ఆయన క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.అయితే పవన్ కళ్యాణ్ కు మొదటి చిత్రం అయిన “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” షూటింగ్ సమయంలో నెలకి ఐదు వేల రూపాయలు పారితోషకం గా ఇచ్చేవారంట అల్లు అరవింద్.అలా మొత్తానికి తన మొదటి చిత్రానికి 50 వేల రూపాయల కంటే తక్కువ పారితోషకాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్.

అయితే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెరంగ్రేటం చేసిన పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ను సినిమా పరిశ్రమకు పరిచయం చెయ్యడానికి చాలా సినిమా కధలు పరిశీలించి చివరగా బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన “ఖయామత్ సే ఖయామత్ తక్” అనే చిత్రాన్ని రీమేక్ చెయ్యడనికి నిశ్చయించుకొని ఆ సినిమా నిర్మాణ బాధ్యతలను అల్లు అరవింద్ కు ఇచ్చారు.అయితే ఈ చిత్రాన్ని తెలుగులో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” అనే పేరుతొ ఈ.వి .వి.సత్యనారాయణ తెరకెక్కించారు.కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.


You may also like