Home Filmy Adda మంచి మనసు చాటుకున్న పవన్ భార్య… అచ్చం పవన్ లాగానే చేశారు…!

మంచి మనసు చాటుకున్న పవన్ భార్య… అచ్చం పవన్ లాగానే చేశారు…!

by Sainath Gopi

సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందరికో దానాలు చేస్తూ ఉంటారు. కానీ వాటిని ప్రచారం మాత్రం చేసుకోరు. పవన్ కళ్యాణ్ ద్వారా సాయం పొందిన వారే బయటకు వచ్చి చెబుతూ ఉంటారు. ఎందరో మంది అనాధలకు ఎంతో మంది పేదవాళ్లకు పవన్ కళ్యాణ్ ఆసరా అందించి డబ్బు సహాయం చేసి వారి జీవితానికి దారి చూపించారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగానే అతని భార్య అన్నా లెజినోవా కూడా మంచి మనసు చాటుకున్నారు…
మొన్న క్రిస్మస్ సందర్భంగా అనాధాశ్రమంలో పిల్లలతో పాటు క్రిస్మస్ చేసుకున్న అన్నా వారికి గిఫ్ట్ కూడా అందించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో అన్నా పాల్గొన్నారు. ఈసారి కూడా అన్నా తన మంచి మనసును చాటుకున్నారు.ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. పిల్లలతో కలిసి కేక్ కటింగ్ జరుపుకునే వారికి వస్తువులు నిత్యవసర సరుకులు అందజేశారు.

అలాగే స్వచ్ఛంద సంస్థలో ఉంటున్న ఐదుగురు బాలికలు ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వారి స్కూల్ ఫీజులు తనే స్వయంగా కట్టారు. పవన్ లాగానే అతని భార్య కూడా మంచి మనసు ఆ భగవంతుడు ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన సొంత డబ్బులను ఎందరో మంది కౌలు రైతులకు లక్ష రూపాయలు చొప్పున అందజేశారు. అలాగే రాజకీయాల్లో జనసేన పార్టీ కార్యకర్తలకు ఏదైనా ప్రాణనష్టం జరిగిన అపాయం జరిగిన వారికి ఇన్సూరెన్స్ కూడా అందజేస్తున్నారు.

You may also like