Ads
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరుకున్న క్రేజ్, స్టార్ డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అయినా, తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు.
Video Advertisement
మిగతా వారికంటే భిన్నమైన ఆలోచనా విధానం ఉన్న పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో భారీ విజయాలు పొందాడు. పవన్ సాధించిన హిట్స్ అన్ని కూడా ట్రెండ్ సెట్ చేసినవే. పవన్ 7 వరుస హిట్స్ తో ఇరవై ఏళ్ల క్రితమే రికార్డ్ క్రియేట్ సృష్టించాడు. దీనివల్లే పవన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగింది. ఇటు నటిస్తూనే మరోవైపు దర్శకుడుగా పని చేసాడు. నటిస్తూనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి చిన్న వార్త అయిన కూడా ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ సంచలనం అవుతుంది. ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమా సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వూ సోషల్ మీడియాలో షికారు చేసింది. తాజాగా 1998లో పవర్ స్టార్ ఇంటర్యూకి న్యూస్ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. అయితే పవన్ ఈ ఇంటర్యూలో పర్సనల్ మరియు వృత్తిపరమైన విషయాల గురించి కూడా చెప్పాడు. అందులో మీ మొదటి స్నేహితురాలు ఎవరని అడిగితే ఆరోజుల్లో నాతో మాట్లాడటానికి ఏ అమ్మాయి కూడా ఆసక్తి చూపించేవారు కాదని, నాలో స్పెషల్ ఏం లేదని ఆయన తెలిపాడు. ఇంకా చెప్తూ చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ అయస్కాంత ముక్కలు తెలీకుండా తీసుకున్న విషయం చెప్పాడు.కానీ అప్పుడు చేసినదానికి ఇప్పటికీ కూడా ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది అని బాధ పడుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. దేవదాసు సినిమాలోని అంతా భ్రాంతియేనా సాంగ్ , దాని సాహిత్యం, ట్యూన్ అంటే చాలా ఇష్టమనీ, ఆ ఇంటర్వూలో ఇంట్రెస్టింగ్ విషయాలను పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ ఇంటర్వూ వచ్చిన న్యూస్ పేపర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 2023 సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
End of Article