Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇవాళ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు, అలాగే ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, సినిమా ప్రేక్షకులు అందరూ కూడా మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Video Advertisement
మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నితిన్, ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి, ప్రముఖ రాజకీయ వేత్త కేటీఆర్, దుల్కర్ సల్మాన్, రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్ ఇంకా ఎంతోమంది ప్రముఖులు మహేష్ బాబుకి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వీరందరితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ ఈ విధంగా రాశారు. “మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రముఖ కథానాయకులు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు.”
‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి శ్రీ మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచాం. ‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు శ్రీ మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత శ్రీ మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
పవన్ కళ్యాణ్
(అధ్యకులు-జనసేన పార్టీ)”
అని రాశారు అలాగే తన ఫేస్ బుక్ పేజ్ లో కూడా పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. అలాగే ఈ పోస్ట్ కి ఎంతోమంది, “ఇలా ఒక స్టార్ హీరో, మరొక స్టార్ హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం చాలా ఆనందంగా ఉంది” అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకు ముందు మహేష్ బాబు కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకి విషెస్ తెలిపారు. అప్పుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ మహేష్ బాబుకి థాంక్యూ అని చెప్పారు.
End of Article