Ads
ఇటీవలే అధికారాన్ని దక్కించుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తన పని తీరుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవలే దేశవ్యాప్తంగా ఉత్తమైన పని తీరు కనబరుస్తున్న సీఎం లలో ఎవరు అనే సర్వే లో స్టాలిన్ పేరు కూడా వచ్చింది. అంతే కాదు అసెంబ్లీ లో ఎమ్మెలేలు ఎవ్వరు తనని పొగడవద్దని అనవసరంగా సమయాన్ని ప్రజా ధనాన్ని వృధా చేయవద్దని
Video Advertisement
pawan-kalyan-latest
ఎమ్మెల్ల్యేకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంతే కాదు ఆలా అతిక్రమించిన వారిపైన చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఇక జనసేన అధినేత నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ నాడు సీఎం స్టాలిన్ పైన ప్రశంసలు కురిపించారు ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి..
pawan kalyan
కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు.. అన్ని పార్టీలకు మార్గదర్శకం స్ఫూర్తిదాయకం.. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాని తెలుగు తమిళ భాషల్లో ట్వీట్ చేసారు.
ఇవి కూడా చదవండి :ALI REZA: నడిరోడ్డుపైనే తన భార్యని ముద్దులతో ముంచెత్తిన బిగ్ బాస్ అలీ రెజా !
End of Article