పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన అయ్యపనుమ్ కోషియుమ్ రీమేక్ రూపొందుతోంది అన్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ సినిమా బృందం నిన్న విడుదల చేశారు. పోలీస్ గెటప్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోని పోస్ట్ చేసి, పవన్ కళ్యాణ్ సినిమాలో పోషించే పాత్ర పేరు కూడా రివీల్ చేశారు.

production no 12 glimpse

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్ల నాయక్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా మేకింగ్ వీడియోని సినిమా బృందం ఇవాళ విడుదల చేసింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ తో పాటు, రానా దగ్గుబాటి కూడా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది అని కూడా చిత్ర బృందం ప్రకటించింది.

Watch video :