ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అందుకునే జీతం ఎంతో తెలుసా..? అదనంగా ఇచ్చే సదుపాయాలు ఏంటంటే..?

ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అందుకునే జీతం ఎంతో తెలుసా..? అదనంగా ఇచ్చే సదుపాయాలు ఏంటంటే..?

by Harika

Ads

ఒకపక్క సినిమాలు చేస్తూ, మరొక పక్క రాజకీయాల్లో రాణిస్తున్న నటులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో హరిహర వీర మల్లు, ఓజి సినిమాలు రెండు భాగాలుగా రూపొందుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, గత కొంత కాలం నుండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో, ఎన్నికల ప్రచార పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలు పెడతారు అని తెలుస్తోంది. ఎప్పుడు అనే విషయం ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Video Advertisement

pawan kalyan salary as mla

రెండు సినిమాలు రెండు భాగాలుగా రూపొందుతున్నాయి కాబట్టి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఐదు సినిమాల్లో నటిస్తున్నట్టు లెక్క. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పాల్గొని గెలిచారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మాట్లాడుతూ, ఎమ్మెల్యే కి ఇచ్చే సాలరీ తీసుకుంటాను అని చెప్పారు. అలా తీసుకోవడానికి కారణం వివరిస్తూ, డబ్బులు తీసుకున్న తర్వాత ప్రజలకి తనని కాలర్ పట్టుకొని, డబ్బులు తీసుకున్నావు కదా అని అడుగుతారు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యేగా వచ్చే జీతం ఎంత అనే విషయం మీద ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేకి ఇచ్చే జీతం నెలకి లక్షా పాతిక వేల రూపాయలు.

అంతకుముందు క్వార్టర్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అది లేకపోవడంతో, 50000 రూపాయలు హౌస్ రెంట్ అలవెన్స్ అదనంగా ఇస్తున్నారు. వీటితో పాటు, ఫోన్ సదుపాయాలు, సిట్టింగ్ అలవెన్స్, వారి అవసరాలకు తగ్గట్టుగా వన్ ప్లస్ వన్ లేదా టు ప్లస్ టు గన్ మెన్ సిబ్బందిని అందిస్తున్నారు. వాహనాలు కొనుగోలు కోసం అడ్వాన్స్ ఇచ్చే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. ల్యాప్‌టాప్ లు, ట్యాబ్ లు కూడా అందించారు అని దాఖలాలు ఉన్నట్లు సమాచారం. భారతదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ ఒకే రకంగా జీతం వస్తుందా అంటే, అలా ఉండదు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల జీతాల విషయంలో పరిమితులు ఉండవు. ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని జీతాలని నిర్ణయిస్తారు.

ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జీతాలు ఉంటాయి. శాసనసభ్యులకు జీతంతో పాటు, నియోజకవర్గ అలవెన్స్, కంటింజెన్సీ అలవెన్స్, సెక్రటేరియట్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్ కూడా అందుతాయి. అసెంబ్లీ సమావేశాల్లో సభకు హాజరైన రోజుకి ఆరోజు హాజరైన వారికి సిట్టింగ్ అలవెన్స్ ఇస్తారు. ఎమ్మెల్యేలకి వాహనాలు, సాంకేతిక పరికరాలు, ఫర్నిచర్ వంటివి కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ సదుపాయం కూడా లభిస్తుంది. మాజీ ఎమ్మెల్యే లకి పెన్షన్ తో పాటు, ట్రావెల్, మెడికల్ సదుపాయాలను కూడా అందిస్తారు. జీతాలని ఇలా నిర్ణయిస్తారు.


End of Article

You may also like