Ads
వన్ డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 లో భారత్ తరుఫున కేవలం 4 మ్యాచ్స్ లో 16 వికెట్స్ కొల్లగొట్టి టాప్ వికెట్ తీసుకున్న బౌలర్లు లిస్ట్ లో చేరిపోయారు పేసర్ మొహమ్మద్ షమ్మీ. ఈ ఆకర్షణీయమైన బౌలింగ్ చూసి అభిమానులలో ఒకరైన బెంగాలీ నటి మరియు రాజకీయ్య వ్యక్తి అయిన పాయల్ ఘోష్ ఒకరు.
Video Advertisement
ఆమె షమ్మీ బౌలింగ్ కి ఫ్యాన్ అయ్యిపోయి ఇలా అంది, ” నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటే,నిన్ను నేను పెళ్లి చేసుకుంటా!”.ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొంత మంది పేరుకుంటే మరి కొంత మంది “భారత దేశం లో ఉంటూ ఇంగ్లీష్ భాష పై నీ దృష్టి ఏమిటి” అని ప్రశ్నిస్తూన్నారు; ఇంకొంత మంది షమ్మీ ని చేసుకొనే స్థాయికి నువ్వు ఇంకా చేరుకోలేదు అంటూ పాయల్ మీద మండి పడుతుంన్నారు.
ఇది ఇలా ఉండగా పాయల్ చేసిన పాత #METOO అంటూ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పైన చేసిన పోస్ట్స్ వెలుగులోకి వచ్చాయి. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని నెటిజన్స్ అంటున్నారు.షమ్మీ కి ఇది వరకే 2014 లో హసిన్ జహాన్ తో పెళ్లి అయ్యి 2015 లో వారికీ ఒక పాప కూడా ఉంది. తరువాత కోర్ట్ కేసులో మనస్పర్థల కారణంగా విడాకులు కూడా తీసుకున్నారు.విడాకులు తీసుకున్న షమ్మీ కి రెండవ భార్యగా ఎలా ఉండగలవు అని విమర్శిస్తున్నారు కొంతమంది.
లీగ్ మ్యాచ్స్ లో ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలింది నెథర్లాండ్స్ ఫై. దీనితో పాటు సెమీ ఫైనల్ లో ఎవరి తో సమరం అనేది వేచి చూడాలి.దానితో పాటు ఈ సారి ప్రపంచ కప్ భారత్ సాధిస్తుంది అని అభిమానులు తమ ఆకాంక్షలు పెట్టుకున్న ప్లేయర్స్ లో మొహమ్మద్ షమ్మీ ఒక్కరు.షమ్మీ యొక్క మనో ధైర్యాన్ని అందరు స్ఫూర్తి తీసుకోవాలి అని చాలా మంది మానసిక వైద్యులు చెబుతున్నారు.
End of Article