Ads
ఆర్ఎక్స్ 100 చిత్రంతో తన అందంతో, అభినయంతోను ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది పాయల్ రాజపుట్. అంతకుముందు కూడా వెండితెరపై మెరిసినా గాని ఆర్ఎక్స్ 100 చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు పాయల్ ..ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది ..దీంతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు పాయల్ .
Video Advertisement
నేటికీ పాయల్ ను ఇందుగానే గుర్తిస్తున్నారంటే ఆ పాత్ర ఎంతగా ప్రేక్షకుల హృదయాలలో ముద్ర వేసుకుందో మనం అర్ధం చేసుకోవచ్చు . తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాల్లో కూడా నటించింది పాయల్. తాజాగా పాయల్ 12 వ తరగతి చదువుతున్నప్పటి ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఎంత క్యూట్ గా ఉందో లుక్ వేయండి.
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్న సెలబ్రిటీలలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. పాయల్ తన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు పాయల్మ రోసారి వార్తల్లోకి వచ్చింది, కానీ ఈసారి తన ప్లస్ 2 రోజులలో తీసిన చిత్రంతో..పాయల్ ఈ చిత్రంలో పింక్ సల్వార్ లో పక్కింటి అమ్మాయి లాగా ఉన్నారు. ఆ ఫోటో ఆమె అభిమానులకు పెద్ద ట్రీట్.
మరోవైపు గత కొన్ని రోజులుగా పాయల్ రాజ్‌పుత్ రెండు ‘స్పెషల్ సాంగ్స్’లో నటించబోతుంది అనే వార్త వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ యొక్క “పుష్ప” మరియు భారతీయుడు సీక్వెల్ లో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది అనే వార్త వైరల్ అయ్యింది. దీనిపై పాయల్ స్పందించి …అవి ఉత్తి పుకార్లే అని కొట్టిపడేసారు. గతంలో లాక్ డౌన్ సమయంలో పాయల్ పిల్లో అడ్డు పెట్టుకుని దిగిన ఫోటో మరియు పేపర్ డ్రెస్ వేసుకొని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానిపై ఎన్నో ట్రోల్ల్స్ కూడా వచ్చాయి.
End of Article