బాబోయ్ ఎంత ప్లాన్ వేసింది…పాయసంలో నిద్రమాత్రలు కలిపి భర్త నిద్రమత్తులోకి జారుకోగానే?

బాబోయ్ ఎంత ప్లాన్ వేసింది…పాయసంలో నిద్రమాత్రలు కలిపి భర్త నిద్రమత్తులోకి జారుకోగానే?

by Megha Varna

ఆంధ్రజ్యోతి కధనం ప్రకారం …..తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడు అని భర్తను హత్య చేయించింది ఓ మహాతల్లి .ఆ తర్వాత హత్యను అనుకోని ప్రమాదంగా జరిగినట్టు చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నం చేసారు .కానీ ఆ ప్రయత్నాలు పోలిసుల ముందు ఫలించలేదు .త్రి టౌన్ సిఐ తబ్రేజ్ తెలిపిన వివరాల ప్రకారం …నగరంలోని జిప్సన్ కాలానికి చెందిన రామానాయుడుకు 17 ఏళ్ళ క్రితం నిర్మల అనే మహిళతో వివాహం అయింది.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు .రామనాయుడు తాగుడికి బానిసై ,ప్రతిరోజూ భార్యతో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు ..

Video Advertisement

భర్త ఎప్పుడూ తాగుతూ ఉండేవాడు దీనితో కుటుంబ పోషణ కష్టమైంది.దీంతో నిర్మల రెండేళ్ల క్రితం ఎస్ఎల్ కేవీ ఫుడ్ ఫ్యాక్టరీలో స్వీపర్ గా చేరింది ..దీంతో అక్కడే పని చేస్తున్న కిషోర్ బాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది ..ఈ విషయం తెలుసుకున్న రామానాయుడు తరచుగా భార్యతో గొడవపడేవాడు ..ఈ నేపథ్యంలో భర్తను ఎలా అయినా చంపేసి అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకుంది నిర్మల ..దీంతో కిషొర్ ను సహాయం అడిగింది .ఇంకా రామానాయుడు ను హత్య చేసేందుకు తన అల్లుడు ,ధర్మపేటకు చెందిన విజయ్ ,స్నేహితుడు రాకేష్ ను కిషొర్ సంప్రదించాడు ..అందరు కలిసి రామానాయుడు ను హతమార్చేందుకు పక్కా ప్రణాళిక రచించారు ..

మర్చి 22 ,జనతా కర్ఫ్యూ   రోజున రామానాయుడు తో నిర్మల పాయసం తాగించింది .పాయసంలో నిద్ర మాత్రలు కలిపింది ..అది తాగిన  రామానాయుడు మెల్లగా నిద్రలోకి వెళ్ళాడు .ఆ రాత్రి 11 గంటల సమయంలో విజయ్ ,రాకేష్ ,కిషొర్ ఆటో లో రామానాయుడు ఇంటికి చేరుకున్నారు .నిద్ర మత్తులో ఉన్న రామానాయుడు ని గొంతుపై కాలుపెట్టి చంపేశారు .అనంతరం మృతదేహాన్ని తీసుకుని నంద్యాల రోడ్డులో ఉన్న దింన్నేదేవరా పాడు వంతెన ఫీట్ రోడ్డుకు వద్దకు తీసుకువెళ్లి పడేసారు .ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంను ఆటోతో తొక్కించారు ..

source

ఆ మరుసటి రోజు తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని నిర్మల పోలీసులకు పిర్యాదు ఇచ్చింది .అనంతరం సిఐ తబ్రేజ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేసారు .పోస్టుమార్టం రిపోర్ట్ తో రామానాయుడు మృతిపై అనుమానాలు తలెత్తాయి .దీంతో పోలీసులు అనుమానస్పద మృతి అని కేసు ను నమోదు చేసుకున్నారు .నిర్మల అసలు ఎలాంటిది తన వ్యక్తిత్త్వం ఎలాంటింది అని తాను పనిచేసే చోట మరియు చుట్టుపక్కల అరా తీశారు ..దీనితో పాటు టెక్నాలజీ ని ఉపయోగించారు ..దీంతో రామానాయుడు ప్రమాదంలో చనిపోలేదని ,హత్య చేసారని పోలీసులు నిర్దారించారు ..అనంతరం నిర్మలను ,రామానాయుడును హత్య చేసేందుకు సహకరించిన కిషొర్ ,రాకేష్ ,విజయ్ లను అదుపులోకి తీసుకున్నారు.


You may also like

Leave a Comment