వీడియో వైరల్: ఊ అంటావా మావ.. పల్లీలు తింటావా మామ అంటూ పల్లీలమ్మే వ్యక్తి .!

వీడియో వైరల్: ఊ అంటావా మావ.. పల్లీలు తింటావా మామ అంటూ పల్లీలమ్మే వ్యక్తి .!

by Megha Varna

Ads

ఈ మధ్య కాలంలో బండి మీద ఆహార పదార్థాలు అమ్ముకునే వాళ్ళు వైరల్ అయిపోతున్నారు. మొన్నటికి మొన్న వచ్చిన కచ్చా బాదం పాట విపరీతంగా వైరల్ అయ్యింది. దానిని చాలా మంది నవ్వుతు పాడుకుంటున్నారు. అలానే డాన్స్ కూడా ఆ పాటకి చేసేస్తున్నారు. అయితే తాజాగా ఒక పల్లిలను అమ్మే వ్యక్తి నెట్టింట్లో వైరల్ అయ్యాడు.

Video Advertisement

ఇంతకీ పల్లీలను అమ్మే వ్యక్తి ఏం చేశాడు..? ఎలా వైరల్ గా మారాడు అనే దాని గురించి చూద్దాం. ఈ మధ్య కాలం లో చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

పైగా ఏదైనా కొంచెం వెరైటీ గా చేసినా సరే వైరల్ అయ్యిపోతున్నారు. గతం లో అయితే నలుగురికి మనం తెలియాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పుణ్యమా ఇప్పుడు చాలా స్పీడ్ గా ఫేమస్ అయ్యిపోవచ్చు. అయితే బండి మీద పల్లీలను అమ్మే వ్యక్తి ఊ అంటావా మామ.. పల్లీలు తింటావా మామ అంటూ వెరైటీగా అమ్మడం మొదలు పెట్టాడు.

oo antava 1

అలానే బండిని తోస్తూ అఖండ పల్లీలు.. పుష్ప పల్లీలు అని వెరైటీగా అమ్ముతున్నాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతున్నారు. కొందరైతే నవ్వుకుంటున్నారు. ఇలా వీధిలో వెరైటీగా అమ్ముకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలా పల్లీలుని వెరైటీగా అమ్ముతూ ఆ వ్యక్తి సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయిపోయాడు.

ఇలా పాటలా అమ్ముతూ ఆ వ్యక్తి ఉడికించిన పల్లీలు.. కాల్చిన పల్లీలు అంటూ ఎంతో ఫన్నీగా అమ్ముతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అది చూసి చాలా మంది నచ్చినట్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. కచ్చా బాదం పాటని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

watch video:


End of Article

You may also like