Ads
ఎచ్చెర్ల మండలంలో ఇటీవల చోటు చేసుకున్న ఒక ఘటన రెండు కుటుంబాలకి విషాదాన్ని మిగిల్చింది. సాక్షి కథనం ప్రకారం ఎన్ఎల్పేట మండలం చింతలబడవంజ గ్రామానికి చెందిన శిరీష, ఎచ్చెర్ల మండలం తోటపాలేం పంచాయతీ పెయిలవాని పేట గ్రామానికి చెందిన హేమసుందరావు శ్రీకాకుళం లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. శిరీష కి తండ్రి లేరు. తన తల్లి శిరీష ప్రేమని ఒప్పుకోలేదు. దీంతో వీళ్ళిద్దరూ 2019లో జూన్ 21వ తేదీన లావేరు మండలం మురపాక గ్రామం లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
Video Advertisement
తర్వాత పెయిలవాని పేటలో హేమ సుందరావు ఇంట్లో కొత్త కాపురం మొదలుపెట్టారు. గత కొంత కాలం నుండి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. 2020, సెప్టెంబర్ 2వ తేదీన శిరీష ఇంట్లోనే అపస్మారక స్థితి లో ఉన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అప్పటికే శిరీష చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. శిరీష ఆడపడుచు శిరీష తల్లికి ఈ విషయం చెప్పారు. శిరీష పల్లి రాజేశ్వరి తన కూతురు మృతిపై అనుమానాలున్నాయని, హేమ సుందరావు కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధింపులకు పాల్పడ్డారని సెప్టెంబర్ 3వ తేదీన ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే ఆస్పత్రిలో పని చేస్తూ ఉండడంతో, వైద్యం గురించి అవగాహన ఉండడంతో హేమసుందరావు మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య చనిపోవడం, పోలీసుల విచారణ సాగడం వంటి విషయాల వల్ల మనస్తాపానికి గురై హేమసుందరావు ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది. ఇరు కుటుంబాల సభ్యులు ఆందోళనలో ఉన్నారు. పోలీసులు కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
End of Article