Ads
అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటి అన్నట్టుగా…. గంట క్రితం జరిగిన పెళ్లి ఆగిపోతుందని ఎవరైనా కలగంటారా..పెళ్లి కొచ్చిన అతిధులు అనుకుంటారా..పెళ్లి వారనుకుంటారా..ఆఖరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయినా ఎక్స్పెక్ట్ చేస్తారా..కానీ జరిగిన పెళ్లి ఆగిపోయింది..మళ్లీ పెళ్లి జరిగింది..అర్దం కావట్లేదా..నల్లగొండ జిల్లాలో సినిమాటిక్ గా చోటుచేసుకున్న ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది..అసలింతకి ఏం జరిగిందో తెలియాలంటే చదవాల్సిందే..
Video Advertisement
నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన మౌనిక రాజేశ్ అనే యువకుడితో ప్రేమలో ఉంది..రాజేశ్ మరెవరో కాదు మౌనికకు వరుసకు మావయ్య అవుతాడు.. ఇద్దరూ వారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి భయపడ్డారు..దాంతో మౌనికకు కుటుంబసభ్యులు మరో వ్యక్తితో పెళ్లి కుదిర్చారు..పెళ్లి సంభంధాలు చూసేటప్పుడు కానీ, నిశ్చయతాంబులాలు పెట్టుకునేటప్పుడు కూడా మౌనిక నోరు మెదపలేదు..ఇంతలో పెళ్లి రోజు రానే వచ్చింది.
మొత్తానికి పెళ్లి జరిగింది..హఠాత్తుగా పెళ్లి దగ్గర రాజేశ్ ప్రత్యక్షం అయ్యాడు.దాంతో మౌనిక పెళ్లి పీటల మీద నుండి లేచి పరిగెత్తకుంటూ వెళ్లి రాజేశ్ ని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టింది.పెళ్లికి వచ్చిన వారికే కాదు..పెళ్లివారికి,మౌనిక కుటుంబ సభ్యులకు కూడా ఏం జరుగుతుందో అర్దం కాలేదు..తీరా మౌనికని నిలదీస్తే అసలు విషయం మెల్లిగా చెప్పింది..సినిమాటిక్ గా అనిపించిన
అంతే పెళ్లి జరిగిన మండపంలోనే పెళ్లికొడుకు పంచాయితి పెట్టించాడు..విషయం పోలీసుల వరకు వెళ్లడంతో పోలీసులు కూడా చేరుకున్నారు..మొత్తానికి చర్చలన్ని ముగిశాక రాజేశ్ ని మర్చిపోలేనని మౌనిక చెప్పడంతో, పెళ్లి రద్దు చేసుకుంటున్నామని మగపెళ్లి వాళ్లు కూడా తేల్చేశారు..ఇక ఆ పెళ్లికొడుకుతో ఎలా సెటిల్ చేసుకోవాలో అనేది తేల్చుకోవడానికి మౌనిక నాన్న నాన తిప్పలు పడ్డాక.. మరుసటి రోజు మౌనిక రాజేశ్ ల పెళ్లి జరిగింది..మొత్తానికి ప్రేమకథ సుఖాంతం..
End of Article