పెళ్లయిన వారం రోజులకే…పెళ్లి కార్డు పైన అదంతా రాసి..! అసలేమైంది?

పెళ్లయిన వారం రోజులకే…పెళ్లి కార్డు పైన అదంతా రాసి..! అసలేమైంది?

by Sainath Gopi

వివాహమైన వారం రోజులకే వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చివ్వెంల మండలంలోని కుడకుడ గ్రామంలో గల వినాయకనగర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే…ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఘట్టికల్‌ గ్రామానికి చెందిన సామ ఇంద్రారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వినాయకనగర్‌లో నివాసముంటున్నారు. ఆయనకీ ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు మౌనిక(24) సీఏ పూర్తి చేసి మంచి వేతనంతో ఉద్యోగం చేస్తోంది.

మౌనికారెడ్డి ని ఈసీఎల్‌కు చెందిన బద్దం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు సాయికిరణ్‌రెడ్డికి ఇచ్చి ఈ నెల 15న సూర్యాపేటలో పెళ్లి చేసారు పెద్దలు. కట్నకానుకల కింద రూ. 10 లక్షల నగదు, సుమారు 35 తులాల బంగారం, 4 కేజీల వెండి అప్పజెప్పారు.సాయి కిరణ్ రెడ్డికి అమెరికాలో సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజినీర్‌‌‌‌గా పని చేస్తున్నాడని, ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌ దగ్గర 5 ఎకరాల భూమి ఉందని చెప్పి పెళ్లి చేసారు. అతడికి ఉద్యోగం లేకపోగా, ఆస్తిపాస్తులు కూడా లేవని తెలుసుకున్న మౌనికారెడ్డి తల్లిదండ్రులు అతడిని నిలదీశారు. దీంతో సాయి కిరణ్ రెడ్డి మౌనికను ఇక్కడే ఉండాలి లేకుంటే వీడుకోలు ఇవ్వాలని బెదిరించారు.

దీంతో భర్త ప్రవతన తట్టుకోలేక తనకు జరిగిన మోసంపై మనస్తాపం చెంది తన పెళ్లి కార్డుపైనే చివరి లెటర్ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది మౌనిక రెడ్డి. శనివారం రాత్రి కూడా వినాయకనగర్‌లోని తమ నివాసానికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఎంత కొట్టినా గది తలుపులు తీయకపోవడంతో కిటికీల్లోంచి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మౌనికారెడ్డి ఆత్మహత్యకు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

You may also like