Ads
ఒకప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలు వివాహ సంబంధాలు చూసేవాళ్ళు.అప్పట్లో ఒక్కో పెళ్లిళ్ల పేరయ్య జీవితంలో కొన్ని వేల పెళ్లిళ్లు చేయించి ఇరు కుటుంబాల మధ్యలో వారధిగా ఉండేవాళ్ళు.ఎటువంటి సమస్య వచ్చిన పెళ్లిళ్ల పేరయ్యలే బాధ్య వహించేవాళ్ళు.కానీ మారుతున్న సమాజాల్లో ఇప్పుడు ఆన్లైన్ వివాహ వేదికలు ఎక్కువ అవుతున్నాయి.అయితే ఆన్లైన్ మ్యారేజ్ వెబ్ సైట్స్ లో మోసపోయినవాళ్లు ఎందరో ఉన్నారు.అయితే తాజాగా మ్యారేజ్ వెబ్సైటు లో నాలుగు పదుల వయసు దాటినా ఓ మహిళా ఎంతో చాకచక్యంతో ఓ ఎన్ఆర్ఐ ను బోల్తా కొట్టింది ..పూర్తి వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
కాలిఫోర్నియా లో సెటిల్ అయినా వరుణ్ అనే అతను ఆన్లైన్ మ్యారేజ్ వెబ్సైటు లో తన ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకున్నాడు.తనకి తగిన వధువు కోసం వేచి చూస్తూ ఉన్నాడు.అయితే రంగారెడ్డి జిల్లా కు చెందిన 43 యేళ్ళ మాధవనేని మరియు తన కుమారుడు అయినా 22 యేళ్ళ ప్రణవ్ లక్సరీ లైఫ్ కు అలవాటుపడ్డారు.కష్టపడకుండా ఈజీ గా వచ్చే మనీ కోసం ఎదురుచూసేవాళ్ళు.అందుకోసం మాధవనేని ఆన్లైన్ మ్యారేజ్ వెబ్ సైట్ లో కీర్తి అని ఒక ఫేక్ ఖాతాను సృష్టించి వరుణ్ అనే ఓ ఎన్ఆర్ఐ తో పరిచయం ఏర్పర్చుకుంది.దీంతో వరుణ్ కి తియ్యటి కబుర్లు చెప్పి రోజంతా గడిపేసేది.కొంచెం పరిచయం పెరగగానే నేను చాలా డబ్బున్న అమ్మాయిని అని మా తండ్రికి నేను ఒక్కదాన్నే కూతుర్ని అని మాకు చాలా కోట్ల ఆస్థి ఉందని నమ్మించింది.
కాకపోతే మా ఆస్తులు అన్ని కోర్ట్ లో కొన్ని వివాదాల్లో ఉన్నాయని వాటి కోసం ముందుగా కొంత డబ్బు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని మాధవనేని వరుణ్ తో చెప్పింది.దీంతో మాధవనేని ని నమ్మిన వరుణ్ 65 లక్షలు మాధవనేని ఖాతాలో జమ చేసాడు.కొన్ని రోజుల తర్వాత మోసపోయానని వరుణ్ కి అర్ధం అయింది.దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించారు వరుణ్.కాగా మాధవనేని మరియు అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే మాధవనేని పై ఇదివరకు కూడా పలు పోలీస్ స్టేషన్ లలో చాలా కేసులు నమోదు అయినట్టు జూబ్లీహిల్స్ సిఐ వెల్లడించారు .
End of Article