హైదరాబాద్ లో జరిగిన ఘటన… పెట్రోల్ అయిపోయిందని 100కి డయల్ చేస్తే…

హైదరాబాద్ లో జరిగిన ఘటన… పెట్రోల్ అయిపోయిందని 100కి డయల్ చేస్తే…

by Megha Varna

Ads

హైదరాబాద్‌ మల్కాజిగిరికి చెందిన ప్రతిభ అనే యువతి తార్నాకలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం(నైట్ షిఫ్ట్) చేస్తుంది. గురువారం రాత్రి 7:14 సమయంలో ఆఫీస్ కి వెళ్లే మార్గంలో తన స్కూటీలో పెట్రోల్ అయిపోవడంతో వెంటనే  డయల్ 100కు కాల్ చేసి ఉన్న విషయం చెప్పింది.  వెంటనే స్పందించిన పోలీసులు 7:30 కల్లా  పెట్రోలు బాటిల్‌తో యువతి వద్దకు చేరుకున్నారు.

Video Advertisement

స్కూటీలో పెట్రోల్  పోసి జాగ్రత్తలు చెప్పి పంపించారు.  రాత్రి 8:30 ఆఫీస్ కు సేఫ్ గా చేరుకున్నట్టు ఆ యువతి ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపింది. ..ఏ క్షణంలోనైనా ఆపదలో ఉన్నామని లేదా ఇతరుల పట్ల అనుమానం వ్యక్తం అయినపుడు 100 ను సంప్రదించాలని కోరారు. ఆపదలో ఉన్న వారు 100 కి డయల్ చేసినట్లయితే మీరున్న చోటుకి కేవలం నిముషాలలో మీ ముందు ఉంటామని హామీ ఇచ్చారు.

100 number

సిటీ లో 24 గంటలు పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతాయని, ప్రజలు దీనిని గమనించి జాగ్రత్తలో ఉండాలని,అపరిచితుల వ్యక్తుల పైన అనుమాన వచ్చినట్లయితే ముందుగా వెంటనే పోలీసులకి 100 ద్వారా సమాచారం అందించాలని పోలీసులు కోరారు….
Source ::V6


End of Article

You may also like