Ads
క్రియేటివిటీ అనేది ఎక్కడైనా సరే అవసరమే. అది ఒక పాయింట్ వరకు బాగానే ఉంటుంది కానీ మితిమీరితే మాత్రం తట్టుకోవడం కష్టం. అలా ఇటీవల ఒక జంట క్రియేటివ్ గా చేసిన ఒక పని ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఈమధ్య ఫోటోషూట్స్ అనేవి కామన్ అయిపోయాయి.
Video Advertisement
పెళ్లికి ముందు ఒక ఫోటోషూట్, పెళ్లి అయ్యాక ఒక ఫోటో షూట్. ప్రెగ్నెన్సీ అప్పుడు ఒక ఫోటోషూట్. పిల్లలు పుట్టాక మరొక ఫోటోషూట్. ఇలా ఏ సమయానికి తగ్గట్టు ఆ సమయానికి కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాస్ తో ఇలాంటి ఫోటోషూట్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి కూడా కొత్త కొత్త కాన్సెప్ట్ ఉంటున్నాయి.
గెటప్స్ లో ఫోటోషూట్స్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. అంతే కాకుండా వేరే లొకేషన్స్ కి వెళ్లి కూడా ఫోటోషూట్స్ చేయించుకుంటారు. ఇప్పుడు ఒక జంట ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయించుకుంది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ జంట ఫోటోషూట్ చేయించుకోవడానికి వాడిన ఐడియా మాత్రం ట్రెండింగ్ లో నిలిచింది. సాధారణంగా రోడ్ మీద ఫోటోషూట్ అంటేనే కష్టం. అలాంటిది ఈ జంట ఒక ఆర్టీసీ బస్ లో ఫోటోషూట్ చేసింది. పెళ్లికూతురు బస్సు నుండి దిగుతూ ఉంటే వెనకాల నుండి అబ్బాయి ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నట్టుగా ఈ ఫోటోషూట్ ప్లాన్ చేసి, ఆ సీన్ షూట్ చేశారు.
“ఈ సాంగ్ షూట్ చేసిన విధానం బాగుంది” అని అంటున్న వాళ్లు కూడా ఉన్నారు. మరి కొంత మంది మాత్రం, “ఆర్టీసీ బస్ లో ఫోటోషూట్స్ ప్లాన్ చేయడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “ఇలా చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది” అని అంటున్నారు. “క్రమశిక్షణ సమస్య కూడా పెరుగుతుంది” అని అంటున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం, “నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలతో పోలిస్తే ఇది అంత పెద్దది ఏమీ కాదు” అని అంటున్నారు. ఈ వీడియోకి రెండు రకాల కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా సరే ప్రస్తుతం మాత్రం ఈ వీడియో గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
watch video :
Are Hyderabad roads now the backdrop for pre-wedding tales?
I'm all in for urban fairy tales, but let’s ensure our roads don't steal the spotlight with unexpected plot twists. Seeking your department's wisdom on this @tsrtcmdoffice@TSRTCHQ @HYDTP #Hyderabad#RoadSafety#Tsrtc pic.twitter.com/mfSTxktmNC— ⚠☄⚕Bad Drivers of Hyderabad ⛙⛴☣ (@trafficpunisher) January 7, 2024
End of Article