ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా.. భారతీయులందరూ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు. 1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారత దేశం చవిచూసింది.
ఈ కాలంలో మన దేశ సంపదను కొల్లగొట్టి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. బ్రిటిష్ పాలనలో భారతదేశ ముడి పదార్థాలను వారి దేశానికి ఎగుమతి చేస్తూ వారి పారిశ్రామిక వస్తువులను మన దేశంలోకి దిగుమతి చేసేవారు. దీంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా నష్టపోయింది. బ్రిటిష్ పాలనకు ముందు భారత దేశ ప్రజలు మెరుగైన జీవనాన్ని గడిపినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.19వ శతాబ్దం చివర్లో భారత గ్రామీణ ప్రజల జీవనం అమెరికాలోని కట్టు బానిసల కన్నా హీనంగా ఉందని నిపుణులు వెల్లడించారు.
అయితే స్వాతంత్య్రం రాక ముందు భారత దేశ పరిస్థితి ఎలా ఉండేదో కింద ఉన్న చిత్రాల్లో చూద్దాం..
#1 జైపూర్ లో ఎలుగుబంటితో ప్రదర్శన చేస్తున్నప్పుడు జనాలు అక్కడ నుంచొని చూస్తున్న దృశ్యం.
#2 అప్పటి కాలం లోని ఓ పండ్ల దుకాణం
#3 ఓ ధనిక బ్రాహ్మణ కుటుంబ చిత్రం
#4 1936 లో బెర్లిన్ లో జరిగిన ఒలింపిక్స్ లో జర్మనీ పై భారత్ గెలిచినా హాకీ మ్యాచ్ లోని చిత్రం. దీని తర్వాత ధ్యానచంద్ ని జర్మనీ కోసం ఆడమని అడిగాడు అడాల్ఫ్ హిట్లర్.
#5 ఓ భారతీయ కుటుంబం
#7 1940 కాలం లోని అంబులెన్సు లు
#8 1930 లో నిర్మాణం లో ఉన్న కలకత్తా హౌరా బ్రిడ్జి
#9 చివరిగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ని బ్రిటిషర్లు బంధించినప్పటి దృశ్యం
#10 1930 లో ఉప్పు సత్యాగ్రహం లో గాంధీజీ పాల్గొన్నప్పటి దృశ్యం
#11 గాంధీజీ, మొహ్మద్ అలీ జిన్నా కలిసినప్పటి ఫోటో
#12 ముంబై లోని గేట్ వే అఫ్ ఇండియా
#13 1927 లో భగత్ సింగ్ జైలు లో ఉన్నప్పటి చిత్రం
#14 లార్డ్ మౌంట్ బాటెన్ భారత దేశానికి స్వాతంత్య్రం ప్రకటించినప్పటి చిత్రం
#15 1947 , ఆగస్టు 15 న భారత త్రివర్ణ పతాకానికి లార్డ్ మౌంట్ బాటెన్ సెల్యూట్ చేస్తున్నప్పటి చిత్రం