కేజిఎఫ్ 2 లో ఎలివేషన్స్ ఇచ్చే అనంత్ నాగ్ ప్లేస్ లో ప్రకాష్ రాజ్ నటించడంపై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్..!

కేజిఎఫ్ 2 లో ఎలివేషన్స్ ఇచ్చే అనంత్ నాగ్ ప్లేస్ లో ప్రకాష్ రాజ్ నటించడంపై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్..!

by Megha Varna

Ads

గతేడాది విడుదలైన కన్నడ చిత్రం తెలుగు డబ్ మూవీ కెజిఎఫ్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే.కెజిఎఫ్ 2 కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారంటే అర్దం చేసుకోవచ్చు. ఆ సినిమాలో మొదటి నుండి చివరి వరకు ఒక వ్యక్తి స్టోరీ చెప్తూ ఉంటారు.

Video Advertisement

ఆ పాత్ర పోషించింది సీనియర్ కన్నడ నటులు అనంత నాగ్ అయితే ఆ పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు సుపరిచితులు శుభలేఖ సుధాకర్. కెజిఎఫ్ సినిమాలో ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్లా అనిపిస్తుంటుంది. ఆ వాయిస్ లో బేస్ అలాంటిది. సాహో సినిమా మొత్తం ఒక ఎత్తైతే చివర్లో వచ్చే “సిద్దాంత్ నందన్ సాహో” అని వచ్చే డైలాగ్ మరో ఎత్తు ఆ వాయిస్ కూడా శుభలేఖ సుధాకర్ దే.

“నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు. కాని చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజు లాగా, పెద్ద శ్రీమంతుడిగా చచ్చిపోవాలి”. “చిల్లర కావాలంటే చెయ్యి చాపాలి. అదే నోట్లు కావాలంటే చెయ్యి లేపాలి”. “గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస, గర్జన కన్నాభయంకరంగా ఉంటుంది”.  వంటి డైలాగ్స్ కేజిఎఫ్ సినిమా కి మరొక ప్లస్ పాయింట్ గా నిలిచాయి.

కరోనా వల్ల చాలా కాలం గ్యాప్ వచ్చిన తర్వాత ఇవాళ కేజిఎఫ్ 2 షూటింగ్ మొదలైంది. కేజిఎఫ్ సెకండ్ పార్ట్ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, హీరోయిన్ రవీనా టాండన్ తో పాటు మన తెలుగు నటుడు రావు రమేష్ కూడా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ స్టార్ట్ అయిన షూటింగ్ లో ప్రకాష్ రాజ్  కూడా కేజిఎఫ్ టీం లోకి అడుగుపెట్టారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పైన ఉన్న ఫోటోలు చూస్తే మీ అందరికీ ఒక అనుమానం కలగొచ్చు. ప్రకాష్ రాజ్ గెటప్ చూస్తే కేజిఎఫ్ పార్ట్ వన్ లో అనంత్ నాగ్ గెటప్ లాగానే ఉంది. అనంత నాగ్ ప్లేస్ లో ప్రకాష్ రాజ్ వచ్చారేమో అని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల అనంతనాగ్ కేజిఎఫ్ నుండి తప్పుకున్నారు అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ టాపిక్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1 

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

 


End of Article

You may also like