ఢిల్లీ అల్లర్లు: పిల్లలని స్కూల్ కి పంపించడానికి ఆ కాలనీ వాళ్ళు ఏం చేసారో చూడండి! (వీడియో)

ఢిల్లీ అల్లర్లు: పిల్లలని స్కూల్ కి పంపించడానికి ఆ కాలనీ వాళ్ళు ఏం చేసారో చూడండి! (వీడియో)

by Sainath Gopi

Ads

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో అల్లర్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నిరోజులుగా సాగుతున్న ఈ అల్లర్లలో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తో సహా ఏడుగురు మృతి చెందారు. ప్రజా ఆస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈశాన్య ఢిల్లీలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని అంచనా. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.

Video Advertisement

ఈ అల్లర్లతో విద్యార్ధులు స్కూల్ కు వెళ్లాలంటే హడలిపోతున్నారు. ఏం జరగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో స్కూల్ కు వెళ్లకుండా మానేస్తున్నారు. డిల్లీలోని యమునా విహాన్ వాసులు విద్యార్థులు సురక్షితంగా స్కూల్ కి వెళ్లాలని చేసిన ఓ పని ఇప్పుడు నెట్ ఇంట్లో హల్చల్ అవుతుంది. ట్విట్టర్ లో అప్లోడ్ చేసిన ఆ వీడియోకి ఎంతో మంది ప్రశంసలు అందిస్తున్నారు. ఇంతకీ వారు ఏం చేసారా అనుకుంటున్నారా?

ఢిల్లీలోని యమునా విహాన్ వాసులు మానవ హారంగా నిలబడ్డారు. విద్యార్ధులకు ప్రొటక్షన్ గా నిలబడి విద్యార్ధులకు స్కూళ్లకు పంపిస్తున్నారు. ఆ వీడియో ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు. ఆ ట్వీట్ లో ఏమని రాసారంటే. యమునా విహార్ వద్ద మంచితనం మానవహారం రూపంలో నిలబడింది. ఆ మంచితనం విద్యార్ధులకు సురక్షితంగా స్కూళ్లకు పంపిస్తోంది. ఆచుట్టు పక్కల పరిసరాల్లో ఎక్కడా పోలీసులు కనిపించటంలేదు..మంచితనమే మానవహారంగా నిలబడింది..ఆ మంచితనానికి వందనం.. అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటె..శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఎంట్రీ ఇచ్చారు. మంగళవారం అర్ధరాత్రి హుటాహుటిన రంగప్రవేశం చేశారు. ఢిల్లీ పోలీసు అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమైన గంటల్లోనే ధోవల్ రంగంలోకి దిగారు.

ఢిల్లీలో మూడు రోజులు కొనసాగిన అల్లర్లపై ప్రతిపక్షాలు నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కంప్లైంట్ ఇవ్వనున్నాయి.కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో పార్టీ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరికొంత మంది రాష్టప్రతిని కలవనున్నారు. అల్లర్లకు నైతిక బాధ్యత హోంమంత్రి అమిత్ షా వహించాలని. అతనితో రాజీనామా చేయించాలని కోరబోతున్నాయి.


End of Article

You may also like