ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేదట

ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేదట

by Mohana Priya

Ads

కరోనా. ఇప్పుడు ప్రతిరోజూ ఈ పదం తలుచుకోకుండా ఒక్క మనిషి కూడా ఉండడు. నీటిలో ఒక్క చోట రాయి వేస్తే ఆ ప్రభావం తో కేవలం రాయి వేసిన ప్రదేశమే కాకుండా చుట్టూ ఉన్న నీరు మొత్తం కదులుతుంది. అలానే ఎక్కడో చైనాలో వచ్చిన ఒక వ్యాధి రాష్ట్రాలే కాకుండా దేశాలు కూడా దాటి వ్యాపించింది.

Video Advertisement

ప్రపంచవ్యాప్తంగా కోటికిపైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల దాదాపు ఏడు లక్షల మంది మరణించారు. అలాంటిది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఆ ప్రాంతాల్లో కరోనా లేదని అమెరికా కూడా అధికారికంగా నిర్ధారించింది.

ఉత్తర కొరియా చైనా పక్కనే ఉంది. చైనా లో వైరస్ మొదలయ్యింది అని తెలియగానే ఉత్తరకొరియా సరిహద్దులు మూసివేసింది. కరోనా వైరస్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే చైనా కి వెళ్లే విమానాలన్నింటిని రద్దు చేసి, అన్ని దేశాలతో ఉన్న సరిహద్దులు మూసేసి జాగ్రత్త పడింది తుర్క్మెనిస్థాన్.

కరోనా వైరస్ సోకని ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నవి పసిఫిక్ ద్వీప దేశాలు. అందుకు కారణం ఏంటి అంటే అక్కడి ప్రభుత్వం వారు వేరే దేశం నుండి వచ్చిన వారికి కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి అని సూచించారు. తర్వాత డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు.

పసిఫిక్ ద్వీప దేశాల్లో జనాభా తక్కువ. అందువల్ల చర్యలు సక్రమంగా తీసుకోగలిగారు. అంతే కాకుండా అంతర్జాతీయ విమాన సేవలు కూడా నిలిపివేశారు. దాంతో వైరస్ రాకుండా రక్షించుకోవడం లో సఫలమయ్యారు.

కరోనా సోకని దేశాలు ఏవంటే.

#1 మార్షల్ దీవులు

#2 తుర్క్మెనిస్తాన్

#3 ఉత్తర కొరియా

#4 పలావ్

#5 వనెవాటు

#6 కిరిబాటి

#7 నౌరు

#8 టోంగా

#9 టువాలు

#10 సమోవా

#11 మైక్రోనేషియా దీవుల సమాఖ్య

ఇలా కఠిన నియమాలను విధించి, తగిన చర్యలు తీసుకొని ఈ ప్రాంతాలు కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త పడ్డాయి.


End of Article

You may also like