ఇలాంటి రోడ్లు నెవెర్ బిఫోర్ ఏవర్ ఆఫ్టార్

ఇలాంటి రోడ్లు నెవెర్ బిఫోర్ ఏవర్ ఆఫ్టార్

by Megha Varna

Ads

పర్యావరణానికి పెను సవాలుగా మారుతున్న ప్లాస్టిక్ సమస్యను అరికట్టడానికి భారత్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది.2018లో గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో తొలిసారిగా రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడటం మొదలు పెట్టారు.

Video Advertisement

రోడ్లు వేయటంలో ప్లాస్టిక్ ను వాడటం వల్ల రోడ్డు రిపేర్లు తక్కువగా వస్తాయి.అలాగే తారుతో వేసే రోడ్ల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలను వాడి వేసే రోడ్లు ఎక్కువ కాలం మన్నుతాయిని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తారు రోడ్లు కంటే తక్కువగా ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చింది.

అందుకే కేంద్ర ప్రభుత్వం 40 శాతం రీసైక్లింగ్ కు పనికిరాకుండా కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ తో లక్ష కిలోమీటర్ల మేర రోడ్లను పూర్తి చేయించింది.ఇందులో ఒక కిలోమీటరు రహదారిని వేయడానికి తొమ్మిది టన్నుల తారు, ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలను వాడారు.

ఒక్క టన్ను తారు ధర 30 వేల రూపాయిలు.ఇలా లక్ష కిలోమీటర్ల రోడ్లలో ప్లాస్టిక్ ను వాడటం వల్ల వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.అలాగే ఆ రోడ్డు ఎక్కువ కాలం మన్నుతుందని నిపుణులు చెబుతుండటంతో మరో లక్ష కిలమీటర్ల వేయనున్న రోడ్లలో ప్లాస్టిక్ ను వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


End of Article

You may also like