ఈ సారి నేను హోలీ వేడుకలకు దూరం ….అసలు కారణం ఇదే

ఈ సారి నేను హోలీ వేడుకలకు దూరం ….అసలు కారణం ఇదే

by Megha Varna

Ads

చైనాలో వెలుగులోకి వచ్చి కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో భారతదేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.ఎవరూ ఊహించని విధంగా వచ్చిన కరోనా వైరస్ ప్రజలందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంది. . చైనాలోని ఉహాన్‌లో మొదలైన ఈ వైరస్ ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ, బ్రిటన్, అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, థాయ్‌ల్యాండ్, ఇరాన్, నేపాల్, పాకిస్తాన్, భారత్‌లను తాకింది. ఢిల్లీతో సహా పలు ప్రాంతాల్లో కరోనా అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే గడిచిన కొన్ని నెలల కాలంలోనే సుమారు 60 దేశాల వరకు విస్తరించింది. దీనికి సరైన వైద్య చికిత్స అందుబాటులో లేని కారణంచేత వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటి మాత్రమే మార్గం. భారతదేశంలో కూడా కరోనా వైరస్ బాధిత కేసులు నమోదు అయినా కారణం చేత నిపుణుల సలహా మేరకు ఎక్కువగా జనం గుమిగూడే పరిస్థితులను నిరోధించడం కోసం హోలీ వేడుకలు ఆపివేయడమే మంచిది అన్న ఉద్దేశంతో పీఎం నరేంద్ర మోడీ గారు ఇటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏ విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేస్తూ అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ట్వీట్ చేసారు. ఇదే విషయాన్ని బలపరుస్తూ యూనియన్ మినిస్టర్ అమిత్ షా కూడా ట్వీట్ చేశారు.

Video Advertisement

తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ప్రస్తుతానికి ఈ వైరస్‌కి మందు లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఉండొద్దు. అలాగని వారిని అంటరాని వారిలా చూడకూడదు.

కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది.

కచ్చితంగా ఇంటినుంచి బయటికి, రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్ గానీ, చేతిరుమాలుగానీ ధరించాలి.

గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.

అయినా ఆ ఛాన్స్ డాక్టర్లు మీకు ఇవ్వరు. ఈ వైరస్ ఎవరికైనా వచ్చినట్లు తెలిస్తే… డాక్టర్లు ఆ వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచేస్తారు.

ఎవరికైనా దగ్గు, జ్వరం లాంటివి వస్తే… వాళ్లు జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉంటూ… ఎక్కువ నీళ్లు తాగాలి. ఒకట్రెండు రోజుల్లో అవి తగ్గకపోతే… ఎవర్నీ టచ్ చెయ్యకుండా వెంటనే డాక్టర్‌ను కలవడం బెస్ట్ ఆప్షన్.ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహన ని పెంచుదాం… నలుగురికీ ఈ విషయాలు తెలిసేలా పంచుదాం..


End of Article

You may also like