Home Filmy Adda ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..? Unstoppable ప్రోమోని “పోకిరి”తో సింక్ చేసారుగా..?

ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..? Unstoppable ప్రోమోని “పోకిరి”తో సింక్ చేసారుగా..?

by Mohana Priya

థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి.

తెలుగు ఓటిటి ఆహ కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను ఆహ తీసుకొస్తోంది. ఈ షోలో పలువురు సెలెబ్రిటీలను బాలయ్య బాబు మాట్లాడించారు.

pokiri edit with unstoppable with nbk mahesh babu promo

మోహన్ బాబు ఫ్యామిలీతో మొదలైన ఈ షోలో తర్వాత, నాని, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఇలా చాలా మంది అతిథులుగా వచ్చారు. ఇప్పుడు ఈ షో మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వబోతోంది. ఈ ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు. మహేష్ బాబుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా షో కి వస్తున్నారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది.

pokiri edit with unstoppable with nbk mahesh babu promo

ఈ ప్రోగ్రాంకి సంబంధించి చేసిన ఒక ఎడిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పోకిరి సినిమాలో లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్ వీడియోకి ఈ ప్రోమోతో ఎడిట్ చేసారు. సినిమాలో చివరికి మహేష్ పోలీస్ అని తెలుస్తుంది. ఈ వీడియోలో ఆ ట్విస్ట్ ప్లేస్‌లో వంశీ పైడిపల్లి వచ్చినట్టు, దాన్ని చూసి అందరూ షాక్ అయినట్టు ఎడిట్ చేసారు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ప్రసారం అవుతుంది.

watch video :

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&v=627039105211506

You may also like