ఆ అమ్మాయితో పరీక్ష రాయించడం కోసం ఆ పోలీస్ ఏం చేసారో తెలుసా? హ్యాట్సాఫ్ సార్!!!

ఆ అమ్మాయితో పరీక్ష రాయించడం కోసం ఆ పోలీస్ ఏం చేసారో తెలుసా? హ్యాట్సాఫ్ సార్!!!

by Sainath Gopi

Ads

మరో పది నిమిషాల్లో పరీక్ష. హాల్ టికెట్ మర్చిపోయింది ఆ అమ్మాయి. లేటు అయితే గేటు బయటే. పరీక్ష రాసేదెట్టా అంటూ ఏడుస్తూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన కోల్‌కతా పోలీస్ సార్జెంట్ చైతన్య మల్లిక్ బాలికను పరీక్ష రాసేందుకు సాయం చేశాడు. అతను చేసిన పనికి హ్యాట్సాఫ్ అనాల్సిందే. వివరాలు మీరే చూడండి.

Video Advertisement

సోమవారం ఉదయం 11.40 గంటలకు పరీక్ష. నిమిషం ఆలస్యంగా వచ్చిన కూడా అనుమతించారు. కలకత్తా లోని జైస్వాల్ విద్యమందిర్ పరీక్షా కేంద్రానికి విద్యార్థులు అందరూ చేరుకున్నారు. అందరూ ఇన్విజిలేటర్ కి అడ్మిట్ కార్డు చూపిస్తూ పరీక్షా కేంద్రం లోకి వెళ్తున్నారు,ఇంతలో ఒక అమ్మాయి ఖంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంది.

ఇది గమనించిన ఇన్విజిలేటర్ ఆ అమ్మాయి ని అడగగా. నా పేరు సుమన్ కుర్రే,నేను అడ్మిట్ కార్డు ఇంట్లో మరిచి వచ్చానని లోపలికి అనుమతించాలంటూ ప్రాదేయపడింది. రూల్స్ ప్రకారం అయితే అడ్మిట్ కార్డు లేకుండా అనుమతించేది లేదని చెప్పేశారు. దాంతో పరీక్ష కేంద్రం దగ్గరే బాలిక ఏడుస్తూ ఉండిపోయింది. రూల్స్ ప్రకారం అడ్మిట్ కార్డు ఉంటేనే పరీక్ష రాయడానికి అనుమతి ఇస్తారు. ఆ విద్యార్థి పరీక్ష కేంద్రం దగ్గరే ఏడుస్తూ ఉండిపోయింది. ఆ బాలిక ఏడవడం చూసి అక్కడే డ్యూటీ చేస్తున్నా మాలిక్ అనే పోలీస్ ఉద్యోగి అక్కడికి వచ్చి విషయం ఏంటో తెలుసుకున్నాడు.

నేను నీకు సహాయం చేస్తాను నువ్వు బాధ పడకు అని ధైర్యం చెప్పి,ఆ బాలిక ఇంటి వివరాలు తెలుసుకొని 5.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మాయి సుమన్ కుర్రే ఇంటికి వెళ్ళాడు. మల్లిక్ బాలిక తల్లిని సంప్రదించి అడ్మిట్ కార్డ్ తీసుకొని తిరిగి మధ్యాహ్నం 12.10 గంటలకు బాలికకు అప్పగించాడు.

మీరు సహాయం చేయకపోయి ఉంటే ఈ రోజు నేను పరీక్ష కి హాజరు కాలేకపోయేదాన్ని. నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అని ఆ బాలిక చెప్పింది. పోలీస్ చేసిన సహాయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మల్లిక్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతను చేసిన మంచిపనిని మీరు అందరికి షేర్ చేసి ప్రశంసించండి.


End of Article

You may also like