Ads
రైల్వే స్టేషన్ ఆవరణలో ఆదమరిచి నిద్రిస్తున్న ఒక చిన్నారిపై పోలీసు అధికారి తన జులుం ప్రదర్శించాడు. పదవి చేతిలో ఉంది కదా అని పసిపిల్ల అన్న కనికరం కూడా లేకుండా కాలితో తన్నాడు. ఈ అనాగరికమైనటువంటి చర్య ఉత్తరప్రదేశ్ లోని బల్లియాజిల్లాలోని బెల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.
Video Advertisement
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో విడుదలైన వెంటనే బాగా వైరల్ అయింది. ఈ అమానుషమైన చర్య పై పలువురు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నిద్రిస్తున్న చిన్న పాపపై కాలితో తన్నడానికి అతనికి మనసెలా వచ్చింది…కనీసం మానవత్వం కూడా లేదా అని పలువురు ఆ కానిస్టేబుల్ తీరుపై విమర్శల వర్షం కురిపించారు.
ఇన్సిడెంట్ లో ఉన్న కానిస్టేబుల్ బలిందర్ సింగ్ పని చేసేది నార్త్-ఇష్టం రైల్వే వారణాసి ఆర్పిఎఫ్ విభాగంలో. ఈ సంఘటన వైరల్ అయిన తరువాత అతన్ని గుర్తించి సస్పెండ్ చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో జరిగిన సంఘటన పై స్పందించిన నార్త్ ఈస్టర్న్ రైల్వే విభాగం జరిగిన దుర్ఘటన పై వెంటనే చర్యలు తీసుకున్నామని.. ఇటువంటి చర్యకు పాల్పడిన కానిస్టేబుల్ తక్షణమే సస్పెండ్ చేశామని పేర్కొన్నారు.
వారణాసి డివిజన్ పీఆర్ఓ అయిన అశోక్ కుమార్ మాట్లాడుతూ.. సదరు సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియదని.. కానీ ఇటువంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూసుకుంటామని. ప్రస్తుతం ఈ సంఘటన ఎప్పుడు ,ఎలా, ఎందుకు జరిగింది అన్న విషయంపై దర్యాప్తు కూడా జరుగుతుంది అని పేర్కొన్నారు. అయితే నేటిజెన్లు మాత్రం ఈ సంఘటనపై మండిపడుతున్నారు. ప్రజలను కాపాడడానికి ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లోని వ్యక్తులు కనికరం లేకుండా ప్రవర్తిస్తే ఎలా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు?
End of Article