న్యూ ఇయర్ పార్టీ ని షురూ చేయబోతున్నారా..? పోలీసుల నిబంధనలు చూడండి మరి..!

న్యూ ఇయర్ పార్టీ ని షురూ చేయబోతున్నారా..? పోలీసుల నిబంధనలు చూడండి మరి..!

by Megha Varna

Ads

డిసెంబర్ 31 రాగానే ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఈరోజు స్పెషల్ ఏంటి అని… అయితే డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా పార్టీలు చేసుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ పోలీసులు న్యూ ఇయర్ సందర్భంగా జరిగే పార్టీలు పై మార్గదర్శకాలు విడుదల చేశారు.

Video Advertisement

నిజనికి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు న్యూస్ ఇయర్ కి పార్టీలు చేసుకుంటూ వుంటారు. కొన్నిచోట్ల అపార్ట్‌మెంట్లలోని వారంతా కలిసి గ్రూప్ గా పార్టీలు చేసుకుంటూ వుంటారు.

లేదంటే స్నేహితులంతా కలిసి వారికి నచ్చిన చోట కి వెళ్లి పార్టీలు చేసుకుంటూ వుంటారు. ఈ పార్టీలకు సంబంధించి పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. మరి అవేమిటో ఇప్పుడు చూసేద్దాం. ఇంట్లో, అపార్ట్మెంట్స్ లో న్యూ ఇయర్ పార్టీలు చేసుకునే వాళ్ళు ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలని పోలీసులు అన్నారు. ఇతరులు కనుక ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలానే కొత్త సంవత్సరం అని మాదకద్రవ్యాలు వినియోగిస్తే స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.

మైనర్లను న్యూ ఇయర్ పార్టీలకి అనుమతించరాదని అన్నారు. అశ్లీల, అసభ్యకర డాన్సులకి కూడా అనుమతి లేదు. వస్త్రధారణ లో కానీ పాటలలో కానీ అసభ్యకరం ఉండకూదని సూచించారు. పైగా న్యూ ఇయర్ చోట పోలీసులు వుంటారు. వీడియోలు తీస్తారు. సౌండ్ సిస్టమ్ పరిమితికి తగ్గట్లు ఉందా లేదా అనేది కూడా మిషన్ ద్వారా చెక్ చేస్తారట. పెద్ద ఎత్తున పోలీస్ బృందాలను డ్రంకన్ డ్రైవ్ టెస్టుల కోసం ఏర్పాటు చేస్తున్నారు కూడా. ఒకవేళ కనుక తాగేసి వాహనాలు నడుపుతూ దొరికిపోతే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష పడుతుందట. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే ఛాన్స్ వుంది. పబ్‌ లు, బార్లు, రెస్టారెంట్లు మందు బాబులకు క్యాబ్ ఏర్పాటు చెయ్యాలని.. వాళ్ళని ఇంటికి నిర్వాహకులే పంపాలన్నారు.

 

 


End of Article

You may also like