• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

మనకు అది పోలీస్ సైరన్…కానీ వీధి కుక్కలకు మాత్రం ఏంటో తెలుసా? వైరల్ వీడియో!

Published on April 26, 2020 by Megha Varna

లాక్ డౌన్ వలన కలుగుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు ..లాక్ డౌన్ వలన మనుషులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు .మరి ముఖ్యంగా వలస కూలీలు ,నిరు పేదలు..పనులు లేక చేతిలో డబ్బులు లేక తినడానికి ఆహారం కూడా కష్టం అయిపోయింది .ఏ రోజుకి ఆ రోజే కష్టపడి  కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వాళ్ళది .కానీ లాక్ డౌన్ కారణంగా పని చేయడానికి అవకాశం లేదు దీంతో వారికి పూట  ఆహారం దొరకడం కూడా చాలా కష్టం అయిపోతుంది .లాక్ డౌన్ కారణంగా పరిస్థితులు దయనీయంగా మారాయి .చాలా ప్రాంతాలలో ఆకలితో చాలామంది అలమటిస్తున్నారు .నోరున్న మనుషుల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటె మరి మూగజీవాలు ,వీధి కుక్కల
పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు …

వీధుల్లో ఉండే కుక్కలు ఆకలితో బాధపడుతున్నాయి ..తిండి దొరకక ,నీరు కూడా దొరకక వాటి పరిస్థితి చాలా దయనీయంగా మారింది.లాక్ డౌన్ కారణంగా రోడ్లపై తిరిగేవారు ఎవరు లేరు .దీంతో వాటికీ ఆహారం నీరు అందించే వారే లేరు .ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో జంతు ప్రేమికులు ఈ మూగజీవాలను ఆదుకుంటున్నారు..వీధి కుక్కలకు ఆహారం నీరు అందచేసి వాటి ఆకలి బాధలను తీరుస్తున్నారు .చండీఘడ్ లో గుండెలను పిండే దృశ్యం ఒకటి చోటు చేసుకుంది .

ఓ పోలీస్ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచాడు .లాక్ డౌన్ లో వీధి కుక్కలకు ఆహారం అందచేసి తన సహృదయాన్ని చాటుకుంటున్నాడు ..ప్రతిరోజూ పోలీస్ వాహనంలో ఆయన వస్తాడు.సైరన్ మోగిస్తాడు .మనుషులకు మాత్రం అది భయపెట్టే సైరన్ కావచ్చు కానీ ఆ వీధి కుక్కలకు మాత్రం ఆహారానికి రమ్మని పిలిచే పిలుపు .ఆ సైరన్ శబ్దం వినగానే ఎక్కడెక్కడో ఉన్న కుక్కలు పరుగు పరుగున వచ్చి వాహనం దగ్గరకి చేరతాయి ..ఆ వాహనంలో ఉన్న పోలీస్ బయటకు వచ్చి వాటికి ఆహారం అందిస్తాడు .ఈ సంఘటనను ఓ జర్నలిస్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు .ఈ వీడియో అందరి హృదయాలను కదిలిస్తుంది .కాగా లాక్ డౌన్ విధించినప్పటి నుండి స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన పోలీస్ వారు ఇలా వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్నారు ..

ఇలాంటి సమయంలో ఎవరూ పట్టించుకొని  వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్న పోలీసులను అందరు అభినందిస్తున్నారు..నిజమైన మంచి మనసున్న పోలీసులు అంటూ ప్రశంసిస్తున్నారు .ఈ విపత్కర పరిస్థితులలో మూగ జీవాలను కూడా అందరు పట్టించుకోని వాటికీ ఆహారం నీరు అందించాలని అది అందరి బాధ్యత అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ..

#ChandigarhCurfew
It is a police siren for people, but, for these dogs this is a call that their food has arrived. A team of Industrial Area police station, has been feeding them since lockdown@thetribunechd @DgpChdPolice @ssptfcchd @nilambariips @ParveenKaswan @drqayumiitk pic.twitter.com/UF4SLRgmI2

— Amit Sharma (@amitsharma_17) April 23, 2020


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • ముందు అలా తర్వాత ఏమో ఇలా.! స్టాలిన్ సినిమా లో ఈ విషయం గమనించారా.?
  • Eliminator match: 12 గంటలకు వర్షం ఆగినా సరే.. IPL ప్లే ఆప్స్ మ్యాచుల్లో కొత్త నిబంధనలు.. ఏంటంటే..?
  • “థాంక్యూ” టీజర్ లో ఇది గమనించారా..? నాగ చైతన్య వెనకాల ఏముందంటే..?
  • సలార్ కోసం “ప్రభాస్”కి… ప్రశాంత్ నీల్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా..?
  • రూ. 3 కోట్ల ఇంటికి మెట్లపై టాయిలెట్ పెట్టారు.. ఈ వైరల్ ఫోటో వెనక అసలు స్టోరీ ఏంటంటే?

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions