త్రిష ని ఎందుకిలా వరసగా టార్గెట్ చేస్తున్నారు… ఆ ఎమ్మెల్యే చెప్పాడని రిసార్ట్‌కి వెళ్లింది అంటూ చీప్ కామెంట్స్.!

త్రిష ని ఎందుకిలా వరసగా టార్గెట్ చేస్తున్నారు… ఆ ఎమ్మెల్యే చెప్పాడని రిసార్ట్‌కి వెళ్లింది అంటూ చీప్ కామెంట్స్.!

by Harika

Ads

ఈ మధ్యకాలంలో త్రిషపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. మొన్న మన్సూర్ అలీ ఖాన్ లియో సినిమాలో త్రిషని రేప్ చేసే సన్నివేశాలు లేకపోవడం తనకు చాలా నిరాశను కలిగించిందని చెప్పటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆ సమయంలో చిరంజీవి,కుష్బూ లాంటి అగ్ర నటులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఆమెకి అండగా నిలిచింది. దాంతో మన్సూర్ అలీ ఖాన్ త్రిష కు క్షమాపణలు చెప్పక తప్పలేదు.

Video Advertisement

అయితే ఈ వివాదం ముగిసిన కొద్ది రోజులకే ఇప్పుడు మరొక వివాదం త్రిషను ఇబ్బంది పెడుతుంది. అన్నాడీఎంకే పార్టీ నేత వి ఏ రాజు త్రిషను అగౌరవపరిచేలాగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం లేపుతుంది. గతంలో గౌవత్తూర్ లో ఒక ఫంక్షన్ కు హాజరైన త్రిష ను చూసిన స్థానిక ఎమ్మెల్యే ఆమెపై మనసు పారేసుకున్నారని, ఆమెతో ఒకరోజు గడపటానికి 25 లక్షలు చెల్లించారు అందుకు నేనే సాక్ష్యం అంటూ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు రాజు.

అయితే ఈ విషయంగా త్రిష మండిపడుతుంది. ఈ వ్యాఖ్యలు చేసినవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, న్యాయపోరాటానికి సిద్ధం అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఇటువంటి వారు ఏ స్థాయికి అయినా దిగజారుతారని, ఇటువంటి వారిని చూస్తుంటే అసహ్యంగా ఉందని త్రిష తన ఆవేదన వ్యక్తం చేసింది. మన్సూర్ పై త్రిష చేసిన పోరాటానికి ప్రతిఫలంగా ఆయన నుంచి క్షమాపణలు అందుకుంది.

ఇప్పుడు మరొకసారి న్యాయపోరాటానికి సిద్ధమైన త్రిషకి ఇండస్ట్రీ అండగా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సంబంధం లేని విషయాలలో ఇరుక్కోవటం, ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు ఎదుర్కోవటం త్రిష కు ఆమె అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాల అయినప్పటికీ కూడా మంచి ఫామ్ లో ఉన్న త్రిష ఎదుగుదలని చూడలేక కావాలనే ఇలా చేస్తున్నారు అంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.


End of Article

You may also like