నాలుగు పదుల వయసులో పెళ్లి పీటలెక్కిన హీరోయిన్…వైరల్ అవుతున్న ఫోటోలు.!

నాలుగు పదుల వయసులో పెళ్లి పీటలెక్కిన హీరోయిన్…వైరల్ అవుతున్న ఫోటోలు.!

by Harika

దండుపాళ్యం సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరోయిన్ పూజా గాంధీ. నాలుగు పదుల వయసులో ఓ ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతోంది. ఎవరైతే తనకు భాష నేర్పించి కన్నడ సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేశాడో..ఆ  బెంగళూరు బిజినెస్ మాన్ విజయ్ ఘోర్పడేను బుధవారం నాడు పూజ పెళ్లాడింది. ఎంతో సింపుల్ గా ఎటువంటి అట్టహాసం లేకుండా జరిగిన వీరి వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Video Advertisement

ఖత్రోన్ కె ఖిలాడీ అనే హిందీ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూజ ఆ తర్వాత బెంగాలీ, తమిళ్ భాషల్లో కూడా సినిమాలు చేసింది. మెల్లిగా కన్నడ సినీ ఇండస్ట్రీలో సాలిడ్ గా సెటిల్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా తన లక్ ట్రై చేసుకుంది. దండుపాళ్యం మూవీ తో మంచి నేమ్ రావడంతో ఆ తర్వాత వచ్చిన ఆ సినిమా సిరీస్ లో కూడా పూజ ముఖ్య పాత్ర పోషించింది.

2012లో పూజకు శ్రామికవేత్త ఆనంద్ గౌడ్ తో నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల పెళ్లి క్యాన్సిల్ అయింది. అప్పటినుంచి సోలోగా బతుకుతున్న పూజ 11 సంవత్సరాల తరువాత ఇప్పుడు కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్న విజయ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటికైనా పూజ పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడంపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


You may also like

Leave a Comment