Home Filmy Adda “రాధే శ్యామ్” పాటలో ఇది గమనించారా.? చూసుకోవాలిగా ఎడిటరూ.?

“రాధే శ్యామ్” పాటలో ఇది గమనించారా.? చూసుకోవాలిగా ఎడిటరూ.?

by Mohana Priya

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

pooja hegde dupe used in nagumomu thaarale song

ఈ సినిమాలోని నగుమోము తారలే సాంగ్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ పాట తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఒక వెర్షన్, హిందీ లో ఒక వెర్షన్ ఉంది. తెలుగు పాటని సిద్ శ్రీరామ్ పాడారు. అయితే, ఈ పాటలో ఒకటి గమనిస్తే ఇందులో ఒక షాట్ లో పూజా హెగ్డే, ప్రభాస్ బైక్ మీద వెళ్తూ ఉంటారు. అందులో జూమ్ చేసి చూస్తే, ఆ సీన్ లో ఉన్నది పూజా హెగ్డేలాగా అనిపించట్లేదు. అందులో ఉన్నది పూజా హెగ్డే డూప్ అని మనకి అర్థమైపోతుంది.

pooja hegde dupe used in nagumomu thaarale song

మాములుగా ఈ సినిమా బృందం తరచుగా ఎదో ఒక విషయం మీద సోషల్ మీడియాలో చర్చల్లో నిలుస్తూనే ఉంటారు. ఒక సారి సినిమా రిలీజ్ గురించి, ఇంకొకసారి పాటలు, లేదా ఇంకా ఏమైనా విడుదల చేస్తాం అని ఒక డేట్, టైం చెప్పి తర్వాత ఆ టైంకి విడుదల చెయ్యకపోవడం గురించి, ఇలా చాలా సార్లు ట్రోలింగ్ కి గురయ్యారు. ఈ సారి ఈ సీన్ కారణంగా మళ్ళీ చర్చల్లో నిలిచారు. సాధారణంగా ఏదైనా రిస్కీ సీన్ షూట్ చేస్తున్నప్పుడు డూప్ వాడడం అనేది సహజం. కానీ ఈ సీన్ మామూలుగానే ఉన్నట్టు మనకి తెలుస్తోంది. దాంతో, “ఆ సీన్ లో ఏముందని డూప్ పెట్టి షూట్ చేసారు?” అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

watch video :

You may also like