Ads
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు పూజా హెగ్డే. ఇటీవల మోస్ట్ ఎలిజిలిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరో హిట్ కొట్టి, ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే, రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సర్కస్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Video Advertisement
అలాగే మరి కొన్ని సినిమాలను కూడా పూజా హెగ్డే సైన్ చేసారు. అంతే కాకుండా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాలో కూడా నటించారు. పూజా హెగ్డే తెలుగులో మొదటిగా నటించిన సినిమా ఒక లైలా కోసం. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించారు. ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది.
ఆ తర్వాత ముకుంద సినిమాలో నటించారు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథంలో నటించిన పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. దాదాపు ప్రతీ స్టార్ హీరో సినిమాలో పూజా హెగ్డే నటించారు. ప్రస్తుతం హిందీలో కూడా నటిస్తున్నారు. పూజ హెగ్డే నటించిన ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఇందులో రామ్ చరణ్ పక్కన పూజా హెగ్డే నటించారు.
అలాగే పూజ హెగ్డే ఇటీవల నటించిన రాధే శ్యామ్ సినిమా టాక్ ప్రేక్షకులని నిరాశపరిచింది. ఇప్పుడు బీస్ట్ టాక్ కూడా అలాగే వస్తోంది. దాంతో పూజా హెగ్డే రాబోయే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అనే ప్రేక్షకుల్లో ఆందోళన నెలకొంది. ఇవి మాత్రమే కాకుండా పూజా హెగ్డే కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో కూడా నటిస్తున్నారు. మరి కొన్ని సినిమాలు కూడా డిస్కషన్ దశలో ఉన్నాయి.
End of Article