“మన రిలేషన్ షిప్ ఎప్పుడు అనౌన్స్ చేద్దాం?” అనే ప్రశ్నకి పూజా హెగ్డే స్ట్రాంగ్ కౌంటర్.!

“మన రిలేషన్ షిప్ ఎప్పుడు అనౌన్స్ చేద్దాం?” అనే ప్రశ్నకి పూజా హెగ్డే స్ట్రాంగ్ కౌంటర్.!

by Mohana Priya

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. 2017లో దువ్వాడ జగన్నాథం సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకున్న పూజా హెగ్డే, తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గత సంవత్సరం అల వైకుంఠపురంలో సినిమాతో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో చాలా భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.

Video Advertisement

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యాంతో పాటు, హిందీలో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా, మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా, అలాగే తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాల్లో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే సోషల్ మీడియాలో వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు.

Pooja Hegde funny reply to a fan question

ఇందులో భాగంగా ఎంతో మంది ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు పూజా హెగ్డే సమాధానం చెప్పారు. వీరిలో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్న, అందుకు పూజా చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ వేదికగా పూజా హెగ్డేని ఒక ఫ్యాన్ ఇలా అడిగారు. “మన రిలేషన్ షిప్ ని పబ్లిక్ గా ఎప్పుడు ప్రకటిద్దాం?” అని అడిగారు. అందుకు పూజా హెగ్డే, “రక్షాబంధన్ రోజు?” అని రిప్లై ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా, పూజా హెగ్డే ఇంకా ఎంతో మంది ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.


You may also like

Leave a Comment