అవకాశాల కోసం పూజ హెగ్డే బేరాలు.. రెమ్యూనరేషన్ పూర్తిగా తగ్గించేసిన పొడుగు కాళ్ల సుందరి!

అవకాశాల కోసం పూజ హెగ్డే బేరాలు.. రెమ్యూనరేషన్ పూర్తిగా తగ్గించేసిన పొడుగు కాళ్ల సుందరి!

by Mounika Singaluri

Ads

గత కొద్ది సంవత్సరాలుగా పూజ హెగ్డే తెలుగులో స్వర్ణ యుగం చూసిందని చెప్పాలి. ఆమె బిజీ షెడ్యూల్ చూసిన టాలీవుడ్ ప్రేక్షకులు మరికొన్నాళ్లు ఆమె ఇక్కడ తిరుగులేని తారగా వెలుగొందుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె కెరియర్ ఫాల్డౌన్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ప్రేక్షకులే కాదు పూజ కూడా ఊహించి ఉండదు. పూజ హెగ్డే మూగమూడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశపరచడంతో అక్కడ ఎవరూ ఆమెని పట్టించుకోలేదు. అలాంటి సమయంలో టాలీవుడ్ ఆమెకు చేయూతనిచ్చింది.

Video Advertisement

అలవైకుంటపురం సినిమా ఆమెని తెలుగులో తిరుగులేని తారగా నిలబెట్టింది. తరువాత వరుసగా స్టార్ హీరోలు అందరి పక్కన నటించడంతోపాటు తమిళంలో విజయ్ తోను హిందీలో సల్మాన్ ఖాన్ తోను నటించింది. అయితే సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో పూజ హెగ్డే కు కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. అదే సమయంలో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా బయటికి వచ్చేయటంతో ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలేవి లేకుండా అయిపోయాయి.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీని లైట్ తీసుకున్న పూజ హెగ్డే బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంది. కానీ అక్కడ కూడా కెరియర్ ఆశాజనకంగా లేకపోవడంతో మళ్లీ తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అందుకుగాను పూజా పాపా ఎన్నడూ నేను విధంగా రెమ్యూనరేషన్ విషయంలో బేరాలు సాగిస్తున్నట్లు సమాచారం.

ఇంతకుముందు మూడు కోట్లకు అటు ఇటుగా ఉండే ఈ భామ ఇప్పుడు అందులో సగం రెమ్యూనరేషన్ ఇచ్చినా సినిమా చేయడానికి సిద్ధంగా ఉంది. మిడ్ రేంజ్ సినిమాలు తీయడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భామ సౌత్ సినిమాలకు తగినట్లుగా ట్రెడిషనల్ లుక్ తో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ తెగ ఫోటో షూట్ లు చేస్తుంది. మరి తగ్గించుకున్న రెమ్యూనరేషన్ వల్ల పూర్వ వైభవం తిరిగి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.


End of Article

You may also like