గతంలో తను తీసుకున్న నిర్ణయానికి ప్రస్తుతం బాధపడుతున్న పూజా హెగ్డే

గతంలో తను తీసుకున్న నిర్ణయానికి ప్రస్తుతం బాధపడుతున్న పూజా హెగ్డే

by Megha Varna

Ads

దీపం ముండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలి అనే సామెత మన తెలుగు హీరోయిన్స్ కు సరిగ్గా సరిపోతుంది.అందుకే సూపర్ హిట్ కొట్టగానే అమాంతం రెమ్యూనిరేషన్ పెంచేసి ప్రొడ్యూసర్స్ కు షాక్ ఇస్తుంటారు.

Video Advertisement

తాజాగా అల వైకుంఠ‌పుర‌ముతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న పూజా హెగ్డేను ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలంతా తమ సినిమాలో హీరోయిన్ గా కావాలని అడుగుతున్నారు.దానితో నిర్మాతలు పూజా హెగ్డేను సంప్రదిస్తున్నారు.గ‌త ఏడాది సినిమాకు కోటి 75 ల‌క్ష‌లు తీసుకున్న పూజా హెగ్డే ఇప్పుడు అమాంతం 3 కోట్లు రెమ్యూనిరేషన్ చెబుతుండడంతో వచ్చిన దారినే వెళ్లిపోతున్నారట.

అనుకోని అతిథి కరోనా సడన్ గా రావడంతో పాపం అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న సినిమాలు ఇప్పుడు ఆమెను కాదని వెరొక్కరికి వెళ్లిపోతున్నాయి.దీనివల్ల కరోనా టైంలో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది పూజనే అని సినీవర్గాలలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పూజ రాధే శ్యామ్,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రాల్లో న‌టిస్తుంది.


End of Article

You may also like