పూజిత పొన్నాడ…షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయ్యి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. రంగస్థలంలో కుమార్ బాబు లవర్ పాత్రలో నటించింది. తర్వాత క‘దర్శకుడు’ ‘కల్కి’ ‘ వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ ‘బ్రాండ్ బాబు’ ‘సెవెన్’ వంటి చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో మంచి ఫోలివింగ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు పవన్, క్రిష్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఐటెం సాంగ్ చేయనుంది అంట.

Video Advertisement

ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.ఆంగ్లేయుల పరిపాలనలో పేద ప్రజల కోసం దోపిడీలు చేసే రాబిన్ హుడ్ తరహా దొంగ పాత్రలో పవన్ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్టు సమాచారం.

పాన్ ఇండియా తరహాలో రూపొందించే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ను హీరోయిన్ గా అనుకున్నారు అంట. కథలో భాగంగా ఎంతో కీలకమైన సందర్భంలో ఓ ఐటెం సాంగ్ ఉంటుంది అంట. ఆ ఐటెం సాంగ్ కోసమే పూజితని అనుకున్నారు అంట. మరి ఈ ఐటెం సాంగ్ అయినా పూజితకి కలిసొస్తుందో లేదో చూడాలి.