అభిమానులు అమాయకులు…రాజకీయ లాభం కోసమే ఇలా చేసుంటారు?

అభిమానులు అమాయకులు…రాజకీయ లాభం కోసమే ఇలా చేసుంటారు?

by Megha Varna

Ads

ఇటీవల కాలంలో మీరా చోప్రా సోషల్ మీడియాలో కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ ను ఎదుర్కొంటున్నారు.నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని కాదు అని అనడంతో ఈ వివాదం మొదలైంది.ఆ తర్వాత కొంతమంది మీరా చోప్రా పై అసభ్యకర కామెంట్స్ చెయ్యడం.మీరా చోప్రా కూడా పరోక్షంగా కొన్ని ట్వీట్స్ చెయ్యడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

Video Advertisement

twitter/poonamkaurlal

ఇప్పుడు ఈ వివాదంపై పూనమ్ కౌర్ స్పందించారు. “సోషల్ మీడియాలో నటులపై జరుగుతున్న దాడులకు సంభందించిన అకౌంట్ లు నిజమైన అభిమానులవా లేదా రాజకీయ లాభాల కోసం సృష్టించబడిన ఫేక్ అకౌంట్ లా లేదా జెన్యూన్ అకౌంట్ లా అనే విషయం మనకు తెలియదు అని పూనమ్ అన్నారు ….ఏది ఏమైనా అభిమానులు మాత్రం అమాయక ప్రజలు కానీ కొంతమంది రాజకీయ వ్యక్తులే చెడ్డవారు “అంటూ ట్వీట్ చేసారు పూనమ్ కౌర్ .

twitter/poonamkaurlal

అసలు వివాదం ఎలా మొదలైంది:

#askmeera వేదికగా ట్విటర్‌లో అభిమానులతో మాట్లాడారు మీరా.ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ ‘ఎన్టీఆర్‌ గురించి ఏమైనా చెప్పండి?’ అని అడిగితే…‘నాకు ఆయన గురించి తెలియదు. ఎందుకంటే నేను ఆయన అభిమానిని కాదు’ అని మీరా సమాధానమిచ్చారు.అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు అని చెప్పినందుకు కొందరు నెటిజెన్స్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అంటూ ట్వీట్ చేసారు మీరా చోప్రా.

ఆ ట్వీట్ పై ఎన్టీఆర్ స్పందించాలి అని ఆమె కోరారు. నీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడంతో నీ అభిమానులు ఇలా కామెంట్స్ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు మీరా.

source: twitter/meerachopra

మంత్రి కేటీఆర్ కు మీరా చోప్రా ట్వీట్…కేటీఆర్ సార్ రిప్లై:

నన్ను కొంతమంది బెదిరిస్తున్నారని అలాగే నాపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మీరా చోప్రా చెప్తూ అందుకు సంబందించిన స్క్రీన్ షాట్స్ తో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరియు కవిత లకు ట్వీట్ చేసారు.అయితే దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..

ఈ విషయాన్ని తెలంగాణ డిజిపి మరియు హైదరాబాద్ పోలీస్ ల ద్రుష్టి కి తీసుకువెళ్లి సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోమని చెప్తాను అని అన్నారు.అయితే తెలంగాణ మంత్రి కేటీఆర్ నుండి రిప్లై రావడంతో మీరా చోప్రా ఆనందం వ్యక్తం చేసారు.మహిళల రక్షణకు   ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం అని మీరా చోప్రా అన్నారు.


End of Article

You may also like