మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందరికీ సుపరిచితమే. టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ కూడా ఒకరు. ఈయన దర్శకత్వం లో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఈయన సినిమాల్లో డైలాగులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

Video Advertisement

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో వచ్చిన సినిమాలో డైలాగ్స్ కామెడీ చాలా బాగుంటాయి. వాటికి లోటే ఉండదు.

netizens found two different dialouges from trivikram..!!

పైగా కామెడీ సీన్స్ ని ఎమోషన్స్ సీన్స్ ని స్క్రీన్ మీదకు తీసుకు రావడంలో త్రివిక్రమ్ తర్వాతనే ఎవరైనా. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ssmb 28 సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరి మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మొదట మనకి డైలాగ్లు,  ఆయన సినిమాలే గుర్తు వస్తాయి. ఆయన అందరితోనూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ ఆట పాటల్లో కూడా చలాకీగా ఉంటారు అన్న విషయం మనకి తెలీదు. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆట పాటల్లో చురుగ్గా వుంటారు. చాలా మందికి ఈ విషయం తెలీదు.

తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ లో క్రికెట్ ఆడుతూ కనపడ్డారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. సరదాగా షూటింగ్ సమయంలో బ్రేక్ లో క్రికెట్ బ్యాట్ పట్టుకుని త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి చాలా ఇష్టం పైగా ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో క్రికెట్ కి సంబంధించిన అంశాలు కూడా కనబడుతూ ఉంటాయి. ssmb 28 సినిమా సెట్ లో బ్యాట్ పట్టుకుని చిత్ర యూనిట్ సభ్యుల తో త్రివిక్రమ్ క్రికెట్ ఆడారు. ఈ సినిమా లో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా పూజ హెగ్దే మహేష్ సరసన నటిస్తోంది.