రెండో ప్రపంచ యుద్ధంలో “ఆలుగడ్డల”తో విజయం సాధించిన అమెరికా…ఎలాగో తెలుసా?

రెండో ప్రపంచ యుద్ధంలో “ఆలుగడ్డల”తో విజయం సాధించిన అమెరికా…ఎలాగో తెలుసా?

by Mohana Priya

Ads

ఆలుగడ్డ అంటే ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. దాదాపు 70 శాతం మందికి ఇష్టమైన కూర ఆలుగడ్డ అయి ఉంటుంది. బహుశా ఆలుగడ్డ తో వండిన అన్ని రకాలు మిగిలిన కూరలతో వండడానికి రాకపోవచ్చు. మామూలు కూర, వేపుడు, ఉడకబెట్టి చేసిన కూర, కుర్మా, ఇవన్నీ కాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్. ఆలుగడ్డ తినడానికే కాకుండా రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికాను గెలిపించడానికి కూడా సహాయం చేసింది. ఎలాగంటే.

Video Advertisement

1939 నుండి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది అన్న విషయం చాలా మందికి తెలిసిందే. యుద్ధం జరుగుతున్న సమయంలో పసిఫిక్ మహాసముద్రం మీద జపాన్ సైన్యం ఉన్న సబ్ మెరైన్ ఉంది. అప్పుడే అమెరికా సైన్యం ఉన్న సబ్ మెరైన్ కూడా వచ్చింది. అమెరికా సైన్యం అక్కడ జపాన్ సైన్యం ఉన్న విషయాన్ని ముందే గ్రహించి డెక్ లో దాచిన తమ ఆయుధాలను తీయడానికి ప్రయత్నం చేశారు.

కానీ అమెరికా సైన్యం ఆయుధాలు తీయడానికి సమయం ఎక్కువ పట్టేలా ఉంది. దాంతో జపాన్ వాళ్ళు దాడి చేస్తారేమో అన్న ఆలోచనలో వాళ్ళు వండుకోవడానికి తెచ్చుకున్న ఆలుగడ్డలను తీసి జపాన్ సైన్యం మీదకి విసరడం మొదలుపెట్టారు. జపాన్ సైన్యం ఆలుగడ్డలను చూసి గ్రెనేడ్ ఏమో అనుకున్నారు. దాంతో వాళ్లు కూడా వాళ్ల మీదకి విసిరిన ఆలుగడ్డలను తిరిగి అమెరికా సైన్యం మీదకి విసరడం మొదలు పెట్టారు.

సాధారణంగా గ్రనేడ్ పేలడానికి 15 నుండి 20 సెకండ్లు పడుతుంది. కాబట్టి అమెరికా సైన్యం ఎంత తొందరగా ఆలుగడ్డలు విసురుతూ ఉంటే అంత తొందరగా జపాన్ వాళ్ళు కూడా తిరిగి అమెరికా సైన్యం వైపు విసిరారు. ఇంతలో అమెరికన్లు తమ ఆయుధాలను తీశారు.

ఆలుగడ్డల యుద్ధంలో నిమగ్నమైన జపాన్ సైన్యం అమెరికా సైన్యం ఆయుధాలు తీయడం గ్రహించలేక పోయింది. దాంతో అమెరికన్లు తమ ఆయుధాలతో జపాన్ సబ్ మెరైన్ పై దాడి చేసి సబ్ మెరైన్ ను పేల్చేశారు. అలా ఆలుగడ్డలను వండడానికి, తినడానికే కాకుండా యుద్ధం చేయడానికి కూడా ఉపయోగించారు.


End of Article

You may also like