ఒకేసారి అందరు 9 నిముషాలు లైట్స్ ఆపేసి..తర్వాత ఒకేసారి ఆన్ చేస్తే ఏమవుతుంది?

ఒకేసారి అందరు 9 నిముషాలు లైట్స్ ఆపేసి..తర్వాత ఒకేసారి ఆన్ చేస్తే ఏమవుతుంది?

by Megha Varna

Ads

కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి దేశమంతా ప్రధాని నరేంద్ర మోడీ సూచనాల ప్రకారం నడుచుకుంటుంది ..ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ప్రజలందరూ కూడా సాయంత్రం ఐదు గంటలకు బయటకు వచ్చి చప్పట్లు కొట్టి ఐకమత్యాన్ని చాటవల్సిందిగా  పిలుపునివ్వగా ప్రజలందరూ  ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు ..అదే విధంగా ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు పవర్ ఆఫ్ చేసి చీకట్లో కొవ్వత్తులతోను  దివ్వెలను లేదా సెల్ ఫ్లాష్ తో లైట్ లను తొమ్మది నిమిషాల పటు చూపించి కరోనా సమయంలో మన భారతీయాలందరు ఒక్కటి అని ఈ చీకట్లతో  కరోనా మీద యుద్ధంలో మనమందరం ఒక్కటే అని ఐకమత్యాన్ని చూపించాల్సిందిగా ప్రధాని మోడీ శుక్రవారం పిలుపునిచ్చారు ..కాగా ఒకేసారి పవర్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే వచ్చే ఫ్లయాక్టువషన్ ప్రాబ్లెమ్ గురించి కొన్ని అభిప్రాయాలూ వినపడుతున్నాయి …వివరాలలోకి వెళ్తే

Video Advertisement

లైట్స్ తొమ్మిది నిమిషాల పటు ఆపివేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు ..దీనిని గ్రిడ్ ష్తడౌన్ గా తెలిపారు. అంటే విద్యుత్ అనుసంధానం నిలిపి వేయడం .ఈ గ్రిడ్ ష్తడౌన్ కొంతమందిలో భయాన్ని కలిగించినప్పటికీ అసలు దీనిలో భయపడాల్సిన అవసరం లేదు .దీనికి కారణం భారతదేశ విద్యుత్ యొక్క గృహ డిమాండ్ ఒక్క శాతం మాత్రమే .భారతీయుల గరిష్ట విద్యుత్ డిమాండ్ 170 GW .

అయినప్పటికీ ,లాక్ డౌన్ కారణంగా ,డిమాండ్ 20 శాతానికి పడిపోయింది మరియు ప్రస్తుతం ఏది 120 – 130 మధ్య నడుస్తుంది ..ఇందులో గృహంలో కేవలం 10 – 12 శాతం ఉంటుంది . విద్యుత్ షట్ డౌన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఇప్పటికే 15 GW వరుకు హెచ్చుతగ్గులను నిర్వహించడానికి సిద్ధంగా వుంది .కావున తొమ్మిది నిమిషాల షట్ డౌన్ వలన ఎటువంటి ఇబ్బంది జరగదని అధికారులు చెప్తున్నారు.

మేము 15 GW హెచ్చుతగ్గులకు సరిఅయిన ఏర్పాట్లతో సిద్ధం అవుతున్నాము . డిమాండ్ కి తగినంత బ్యాక్అప్ కూడా సిద్ధంగా ఉంది అని ఒక అధికారి తెలిపారు . ఈ విషయంలో విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( పిజిసిఐఎల్ ) మరియు లోడ్ డిస్పెచెర్ పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోసోకో ) ను కలిశారు ..డిమాండ్ అకస్మాత్తుగా పడిపోయిన నిర్వహించగల సామర్థ్యం ఉంది అని సింగ్ తెలిపారు ..

 

ఏప్రిల్ 14 వరుకు దేశం అపూర్వమైన 21 రోజుల లాక్ డౌన్ ను ఎదుర్కుంటున్న కారణంగా చాలా పరిశ్రమలు, ఆఫీసులు, విద్య సంస్థలు మొదలైనవి మూసి వెయ్యబడ్డ కారణంగా ఇప్పటికే విద్యుత్ డిమాండ్ ను తగ్గించింది ..దీని కారణంగా తగినంత విద్యుత్ సరఫరాను కలిగి ఉంది అని తెలిపారు ..కావున ఈ గ్రిడ్ షట్ డౌన్ వల్ల జరిగే ప్రమాదం ఏమిలేదని అధికారులు తెలుపుతున్నారు .. అయినా లైట్స్ మాత్రమే ఆపండి. ఇంట్లో ఇతర పరికరాలు ఫ్రిడ్జ్ లాంటివి ఆన్ లోనే ఉంచండి.


End of Article

You may also like