Home Filmy Adda PAWAN KALYAN ASSETS: పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆస్తులు ఎంత..? అప్పులే ఎక్కువ..?

PAWAN KALYAN ASSETS: పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆస్తులు ఎంత..? అప్పులే ఎక్కువ..?

by Sainath Gopi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో భారీగా  ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమానులు తెలుగులో ఏ స్టార్ కు లేరని అంటారు. ఆయన వ్యక్తిత్వానికి కూడా కోట్లాదిమంది అభిమానులను ఉన్నారు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ సైతం అందుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ అగ్రహీరోగా కొనసాగుతూనే, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోనూ అడుగుపెట్టి, జనసేన పార్టీని స్థాపించారు. ఏపీ పాలిటిక్స్ లో రాణిస్తున్న పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి గతంలో నాగబాబు చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికి, పవర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కు సొంతం చేస్సుకుని, అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్‌ అయినప్పటికీ  స్టార్ డమ్ పెరుగుతూనే వస్తోంది. కోట్లలో సంపాదించే సత్తా ఉన్న పవన్ వరుస సినిమాలలో నటిస్తూ, వందల కోట్లను సంపాదించుకోవచ్చు. కాని ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో రాజకీయాలలోకి వచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఒక్కో మూవీకి 50 – 60 కోట్ల రూపాయల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటారని ఇండస్ట్రీ టాక్.

అయితే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే పవన్ కు ఎన్ని ఆస్తులను సంపాదించారా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఈ విషయం పై గతంలో మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. పవన్​ కళ్యాణ్ కు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని చెప్పి, అందరికీ షాక్ ఇచ్చారు.  పవన్ కు ఉన్న కార్లు, ఇల్లు సైతం లోన్‌ పై కొన్నవే అంటూ చెప్పుకొచ్చారు. తన లైఫ్ లో తనకంటూ ఏం సంపాదించుకోలేదు.  జనసేన పార్టీ స్థాపించినపుడు కూడా డబ్బులు లేకపోవడంతో పిల్లల పేర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుని ఉపయోగించాడని అన్నారు.
తనకంటూ ఉన్న ఒకేఒక ఆస్తి శంకర్ పల్లి దగ్గర ఉన్న ఎనిమిది ఎకరాల పొలం అని  తెలిపారు. దానిని పవన్ ప్రేమతో కొన్నారని,  పవన్​కు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని అందుకోసమే, ఎన్నో ఏళ్ళ క్రితం కొనుగోలు చేశారని చెప్పారు.  తన కెరీర్ మొదట్లో  మూవీ ద్వారా వచ్చిన  తొలి ఎనిమిది లక్షలతో ఈ పొలాన్ని తీసుకున్నాడు.  అయితే దానిని కూడా ఒక టైమ్ లో అమ్మబోగా తానే వద్దని అడ్డుపడినట్లుగా తెలిపారు. ప్రస్తుతం పవన్ కి ఉన్న ఆస్తి శంకర్ పల్లి ఫార్మ్ హౌస్ ఒకటే అని నాగబాబు చెప్పుకొచ్చారు.

Also Read: “వైవా హర్ష” లాగే… హీరోలుగా చేసి ఫెయిల్ అయిన 8 మంది స్టార్ కమెడియన్లు వీరే.!

You may also like