“ప్రభాస్ 25” టైటిల్ అదేనా.?

“ప్రభాస్ 25” టైటిల్ అదేనా.?

by Mohana Priya

Ads

ప్రస్తుతం వరుస సినిమాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యాం తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా, మన తెలుగు సినిమాల ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా ప్రభాస్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఇటీవల జాతిరత్నాలు సినిమా ట్రైలర్ లాంచ్ ప్రభాస్ చేతుల మీదగా జరిగింది. అంతే కాకుండా సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమా బృందం ప్రభాస్ తో ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశారు.prabhas

Video Advertisement

ప్రభాస్, దిల్ రాజు గారి బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇది ప్రభాస్ 25వ సినిమాగా రాబోతోంది. ఈ సినిమాకి కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తారు అనే వార్త గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాకి టైటిల్ కూడా దిల్ రాజు గారు రిజిస్టర్ చేయించారు. ఈ సినిమాకి వృందావన్ అనే టైటిల్ ఖరారు చేశారు అనే వార్త వినిపిస్తోంది. ఈ సినిమా ఒక మైకథలాజికల్ పిరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు ఏవి ఇంకా పూర్తిగా తెలియదు.


End of Article

You may also like