అదే నిజమైతే…ప్రభాస్ ఇంకో మూడు సంవత్సరాలు కనిపించకపోవచ్చు! ఫాన్స్ పరిస్థితి ఏంటో?

అదే నిజమైతే…ప్రభాస్ ఇంకో మూడు సంవత్సరాలు కనిపించకపోవచ్చు! ఫాన్స్ పరిస్థితి ఏంటో?

by Megha Varna

బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. సాహో కి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అతని అభిమానులు అందరు అతని నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పూజ హెగ్డే సరసన ప్రభాస్ నటించబోయే సంగతి అందరికి తెలిసిందే. సాహో విడుదలకు ముందే దర్శకుడు రాధా కృష్ణ తో మూవీ మొదలుపెట్టినప్పటికీ, ప్రభాస్ సాహో ప్రొమోషన్స్ లో బిజీగా గడుపుతూ ఈ మూవీ షూటింగ్ పక్కన పెట్టాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి సరికొత్త అప్డేట్ వచ్చింది.

Video Advertisement

ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ వచ్చేది 2021లోనే అంట. ఎందుకంటే సినిమా షూటింగ్ మొదలెట్టి సంవత్సరం దాటినా ఇప్పటివరకు సగం షూటింగ్ కూడా అవ్వలేదంట. ఇది ఇలా ఉంటె మరో క్రేజీ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. రాజమౌళి ప్రభాస్ నిర్మాణ భాగస్వాములు కానున్నారట. ఆ బ్యానర్ లో వచ్చే సినిమా కూడా వారి కాంబినేషన్ లోనే అంట. దీని గురించి ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, ఇద్దరు సదాభిప్రాయంకి వచ్చారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇక వీరి ప్రాజెక్ట్ 2021 చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ల్లో తెరకెక్కడం ఖాయం. వీరిద్దరి కాంబినేషన్ అంటే కనీసం సినిమా విడుదల అవ్వడానికి మూడు సంవత్సరాలైనా పడుతుంది అని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి దీని గురించి కచ్చితంగా తెలియాలంటే ప్రభాస్ రాజమౌళి అప్డేట్ ఇచ్చేవరకు వేచి చూడాలి!


You may also like

Leave a Comment