Home Filmy Adda Prabhas : ఆందోళనలో “ప్రభాస్” ఫ్యాన్స్.! కారణం ఏంటంటే.?

Prabhas : ఆందోళనలో “ప్రభాస్” ఫ్యాన్స్.! కారణం ఏంటంటే.?

by Mohana Priya

ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో. అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచింది. టీజర్ చూస్తే ఇది ఒక ప్రేమకథ అని అర్థమైపోతుంది. ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది.

Unnoticed details in Radhe Shyam teaser

ఇదిలా ఉండగా, ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం కొంచెం టెన్షన్ లో ఉన్నారు. అందుకు కారణం ఇటీవల విడుదలైన టీజర్. ఈ సినిమా లవ్ స్టోరీ. ఇందులో ఫైటింగ్స్ ఉండవు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మాస్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందులోనూ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ కి ఇది రెండవ చిత్రం మాత్రమే. అంతకుముందు సుజిత్ తో కూడా సాహో తీసి ఒక సాహసం చేసిన ప్రభాస్ మళ్లీ రిస్క్ తీసుకుంటున్నారో ఏమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. కానీ కొంత మంది మాత్రం చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ ని మళ్ళీ లవ్ స్టోరీ లో చూస్తున్నామని ఆనందపడుతున్నారు.

You may also like