ప్రభాస్ ఒక్క రోజు ఆహారం కోసం ఇంత ఖర్చు చేస్తారా..? ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రభాస్ ఒక్క రోజు ఆహారం కోసం ఇంత ఖర్చు చేస్తారా..? ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Mounika Singaluri

Ads

బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. బాహుబలి తర్వాత సరైన హిట్టు లేని ఆయనకు సలార్ సినిమా ఆ లోటును పూడ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టడంలో సలార్ సినిమా ముందుంది. ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా పడిందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Video Advertisement

అయితే ప్రభాస్ అంటే అందరికీ గుర్తొచ్చే విషయం ఆతిథ్యం. ఆయన ఆతిథ్యం గురించి ఇండస్ట్రీలో అందరూ కథలు కథలగా చెబుతూ ఉంటారు.

ప్రభాస్ తో నటించే హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టులు కోసం రకరకాల వంటలు చేయించి ప్రభాస్ సినిమా సెట్ వద్దకు తెప్పిస్తుంటారు. ప్రభాస్ పెట్టే భోజనం తినడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ చాలామంది సంతోషంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆర్టిస్టు తమకి ఇది ఇష్టమని చెబితే చాలు అది భోజనం టేబుల్ వద్దకు వచ్చి ఉండేదట. అలా ప్రభాస్ తిండి పెట్టి చంపేస్తారు అంటూ సినీ జనాలు చెబుతూ ఉంటారు.

అలాగే ప్రభాస్ కూడా తనకి ఇష్టమైన వంటకాలు తినడంలో వెనకాడరట. ప్రభాస్ డైనింగ్ టేబుల్ మీద అన్ని రకాల వంటలు ఉంటాయట.ఆయన ఎప్పుడు ఏది తింటారో తెలియదు కాబట్టి ప్రతిదీ సిద్ధం చేసి ఉంచుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏప్పుడు ఆయన ఒక్కడే కూడా తినడంట, ఆయన చుట్టూరు 10 మంది ఉండాలట. అలాగే వారికి ఇష్టమైన వంటలు కూడా అక్కడ ఉండేలా చూస్తారట. అయితే తాజగా ప్రభాస్ ఒక రోజు సాయంత్రం తిని భోజనం ఖర్చు గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఆయనతోపాటు ఆయన చుట్టూ తినేవారికి ఇష్టమైన వంటకాలు ఏర్పాటు చేయడానికి ఒక రోజుకి రెండు నుండి మూడు లక్షలు ఖర్చు అవుతుంది అంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


End of Article

You may also like